గసగసాల( poppy seeds ) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.వంట రుచిని పెంచడానికి ఉపయోగించే గసగసాలు ఆరోగ్య పరంగా చాలా మేలు చేస్తాయి.
అలాగే జుట్టు సంరక్షణకు కూడా తోడ్పడతాయి.ఒక్క స్పూన్ గసగసాలతో జుట్టుకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
మరి లేటెందుకు ఆ ప్రయోజనాలేంటి.? అసలు గసగసాలను జుట్టుకు ఎలా ఉపయోగించాలి.? అన్న విషయాలపై ఓ లుక్కేసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ గసగసాలు మరియు పావు కప్పు వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న గసగసాలను వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు పొడి( Curry powder
), రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ( curd )మరియు వన్ టీ స్పూన్ నిమ్మరసం( lemon juice ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లు నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపుము ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.

ఈ గసగసాల మాస్క్ జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.గసగసాల్లో ప్రోటీన్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.ఇవి జుట్టు పెరుగుదలను ప్రేరేపించి, దట్టంగా మారేలా చేస్తాయి.తలకి అవసరమైన పోషకాలను అందించి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఈ గసగసాల మాస్క్ ఉత్తంగా హెల్ప్ చేస్తుంది.

గసగసాల్లో ఉన్న నేచురల్ ఆయిల్స్ తలకు తేమను అందిస్తాయి.డ్రై స్కాల్ప్ ను నివారిస్తాయి.జుట్టును మృదువగా మారుస్తాయి.గసగసాల్లో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చుండ్రుకు చెక్ పెడతాయి.కాబట్టి, హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నవారు, హెయిర్ గ్రోత్ లేదని సతమతం అవుతున్నవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న గసగసాల హెయిర్ మాస్క్ ను ప్రయత్నించండి.