ప్రస్తుత రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరు బిజీ లైఫ్ స్టైల్‌లో పడిపోయారు.కొందరైతే డబ్బు సంపాదన, పేరు ప్రఖ్యాతల కోసం పరుగులు పెడుతూ తినడం కూడా మారచిపోతున్నారు.
దాని ఫలితంగా శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందక ఆరోగ్యం పాడుతుంది.వైద్యుల దగ్గరకు వెళితే మల్టీవిటమిన్ టాబ్లెట్లను( Multivitamin tablets ) వాడమని చెబుతుంటారు.
శరీరానికి అవసరమైన వివిధ రకాల విటమిన్లు మరియు మినరల్స్ ను అందించి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.అందుకే ఈ మధ్య కాలంలో మల్టీవిటమిన్ టాబ్లెట్లను తెగ వాడేస్తున్నారు.
మల్టీవిటమిన్ టాబ్లెట్లు రెగ్యులర్ గా వేసుకోవచ్చా? అంటే మీ ఆరోగ్య పరిస్థితి, ఆహారపు అలవాట్లు, మరియు అవసరాలపై ఆధారపడి ఉంటుంది.మీ ఆహారం పోషకాల పరంగా అపూర్తిగా ఉన్నప్పుడు, వైద్యులు సూచించినప్పుడు, శరీరానికి కొన్ని విటమిన్లు, మినరల్స్ లోపం ఉందని నిర్ధారణ అయినపుడు మల్టీవిటమిన్ టాబ్లెట్లను రోజూవారీ తీసుకోవచ్చు.
అయితే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

మల్టీవిటమిన్ టాబ్లెట్లను అతి మోతాదులో తీసుకుంటే నెగటివ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అందువల్ల వైద్యుల సూచన మేరకు అవసరమైన మోతాదు మాత్రమే తీసుకోవాలి.మల్టీవిటమిన్ టాబ్లెట్లను ఏ సమయంలో వేసుకోవాలో కూడా తెలుసుకోవాలి.
బ్రేక్ ఫాస్ట్ తర్వాత మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకోవడానికి ఉత్తమ సమయం అని చెప్పవచ్చు, ఎందుకంటే శరీరం ఉదయం ఎక్కువ శక్తివంతంగా పని చేస్తుంది.బ్రేక్ ఫాస్ట్( Breakfast ) తర్వాత తీసుకుంటే, కొవ్వు లోపించే విటమిన్లు ఎ, డి, ఇ, కె ( Vitamins A, D, E, K )మెరుగుగా శోషించబడతాయి.
పైగా జీర్ణ సంబంధ సమస్యలు సైతం తలెత్తవు.

భోజనం తర్వాత కూడా మల్టీవిటమిన్ టాబ్లెట్లను తీసుకోవచ్చు.కొన్ని మల్టీవిటమిన్స్ లో బి-కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి.ఇవి శక్తిని పెంచుతాయి, కాబట్టి రాత్రి సమయంలో తీసుకుంటే నిద్రకు ఆటంకం కలిగించవచ్చు.
మిన్నరల్స్ ఎక్కువగా ఉండే మల్టీవిటమిన్లు మాత్రం రాత్రివేళ తీసుకోవచ్చు.తద్వారా నిద్ర నాణ్యత పెరుగుతుంది.
ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.కాఫీ, టీ తాగిన వెంటనే మల్టీవిటమిన్ టాబ్లెట్లను తీసుకోకూడదు.
అలా చేస్తే పోషకాల శోషణ తగ్గుతుంది.