తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన సినిమాలను తీస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.మరి ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ దర్శకులందరు సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే…ఇక యంగ్ డైరెక్టర్లు ( Young Directors )కూడా వాళ్ళ పరిధికి తగ్గట్టుగా మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న యంగ్ హీరోలందరూ యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం విశేషం…ఇక ప్రస్తుతం అనుదీప్ కె.వి తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇప్పటికే ఆయన చేసిన ‘జాతి రత్నాలు’ సినిమా సూపర్ సక్సెస్ అయింది.
ఇక ఆ తర్వాత చేసిన ప్రిన్స్ సినిమా( Prince movie ) పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయిన కూడా ఈ సినిమా మీద మంచి బజ్ అయితే ఉండడంతో మినిమం యావరేజ్ హిట్టుగా ఈ సినిమా నిలిచిందనే చెప్పాలి.మరి ఇప్పుడు ఆయన విశ్వక్ సేన్ ( Vishwak Sen )తో చేస్తున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇప్పటి వరకు కామెడీ వే లో సినిమాను నడిపించిన ఆయన ఇప్పుడు ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలను తీసి మంచి విజయాలను అందుకోవాలని చూస్తున్నాడు.
మరి ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది.విశ్వక్ సేన్ యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో… మరి ఈ హీరోని అనుదీప్ ఎలా చూపిస్తాడు తద్వారా ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడనేది తెలియాల్సి ఉంది…ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ కూడా ప్లాపుల్లో ఉన్నాడనే చెప్పాలి.ఇక రీసెంట్ గా వచ్చిన ‘మెకానిక్ రాకీ’ సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేదు…
.