టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా( Teja Sajja ) గురించి మనందరికీ తెలిసిందే.సినిమా ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు తేజ సజ్జా.
అందులో భాగంగానే చివరగా హనుమాన్ సినిమాతో( Hanuman Movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ఇకపోతే ప్రస్తుతం తేజ మిరాయ్( Mirai ) అనే సినిమాలో నటిస్తున్నారు.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక బిగ్ సర్ ప్రైజ్ ఉన్నట్లు తెలుస్తోంది.అదేంటంటే ఈ మూవీలో పాన్ ఇండియా నటుడు,రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) గెస్ట్ రోల్ లో మెరవనున్నాడట.
అలాగే మిరాయ్ సినిమాలో మాస్ మహారాజా రవితేజ( Raviteja ) అతిథి పాత్ర పోషించే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు ఏకంగా ప్రభాస్ పేరు వినిపిస్తోంది.
ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ది రాజా సాబ్( The Rajasaab ) సినిమా చేస్తున్నాడు ప్రభాస్.ఆ అనుబంధంతోనే మిరాయ్ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం.
కాగా హనుమాన్ తర్వాత తేజ సజ్జా నటిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెల కొన్నాయి.దానికి తోడు ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తే ఇక ఈ సినిమాపై పాన్ ఇండియా వైడ్ గా మంచి అంచనాలు ఏర్పడతాయి అనడంలో సందేహం లేదని చెప్పాలి.అలాగే తేజ అభిమానులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త అని చెప్పాలి.