ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఓటమి ఎదురవుతుంది.ఓటమి ఎదురైన సమయంలో ఏ విధంగా ముందడుగులు వేస్తే కెరీర్ పరంగా కోరుకున్న విజయం దక్కుతుందో సక్సెస్ సాధించిన వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది.
ఓటమి నుంచి కోలుకుని గెలవడం సులువైన విషయం కాదు.అలా చిన్నప్పుడు పరీక్షల్లో ఫెయిల్ అయిన రుక్మిణి రియార్ ( Rukmini Rear )ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆరో తరగతిలో రుక్మిణి ఫెయిల్ కావడంతో కుటుంబ సభ్యులు ఒకింత భయాందోళనకు గురయ్యారు.రుక్మిణి తండ్రి న్యాయవాది కాగా ఆరో తరగతిలో ఫెయిల్ అయిన తర్వాత తన లైఫ్ లో ఫెయిల్యూర్ ఉండకూడదని రుక్మిణి భావించారు.
ఏడో తరగతి నుంచి ప్రతి సంవత్సరం రుక్మిణి కాలేజ్ టాపర్ గా నిలిచారు. గురునానక్ యూనివర్సిటీ( Guru Nanak University ) నుంచి రుక్మిణి బీఎస్సీ హానర్ చదివారు.
హార్డ్ వర్క్, డెడికేషన్ తో యూపీఎస్సీని లక్ష్యంగా నిర్దేశించుకున్న రుక్మిణి రోజుకు 10 గంటల పాటు ప్రిపేర్ అయ్యేవారు.2011 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో రెండో ర్యాంక్ సాధించి ఆమె వార్తల్లో నిలిచారు.నిజాయితీ, అంకిత భావంతో పేదలకు సేవ చేయాలని ఉందని రుక్మిణి వెల్లడించారు.పేదలకు సేవ చేయాలనే ఆకాంక్షతో తాను సివిల్స్ సాధించానని రుక్మిణి చెబుతున్నారు.
రుక్మిణి సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.సహనంతో కష్టపడితే కోరుకున్న సక్సెస్ దక్కుతుందని రుక్మిణి చెబుతున్నారు.రుక్మిణి రియార్ సక్సెస్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రుక్మిణి రియార్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా కచ్చితంగా నిలుస్తుందని చెప్పవచ్చు.
రుక్మిణి టాలెంట్ ను నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.రుక్మిణి కెరీర్ పరంగా మరింత ఎదిగి ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.