యాదాద్రి భువనగిరి జిల్లా:రామన్నపేటలో ఏర్పాటు చేస్తున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 23న జరిగిన ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో అఖిలపక్షాలు రెండువేల రూపాయలకు,బిర్యానీకి అమ్ముడుపోయాయని అపోహస్యం చేస్తే ఊరుకోమని,నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు.శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదాని గ్రూపుకు భూములు కొనుగోలు చేసింది నీ హయాంలోనేనని,చేసేదంతా చేసి ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తే ఎవరూ నమ్మరని,వాస్తవాలు మాట్లాడాలని,నీ అరెస్టులు ఒక నాటకమని,పర్యావరణ పరిరక్షణ వేదికను అపహస్యం చేస్తే ఊరుకోబోమని,రాజకీయం చేయడం మానుకోవాలని,
ఇది ప్రజల జీవన్మరణ సమస్యని గుర్తుపెట్టుకోవాలన్నారు.
ఇన్ని రోజులు యాదికి రాని ప్రజల సమస్య ఈ రోజు యాదికి వచ్చిందా అని ప్రశ్నించారు.ఇదంతా అఖిలపక్షాల ఐక్యతను దెబ్బతీయడానికి నువ్వు చేస్తున్న కుట్రని,నీలాంటి వాళ్లు ఎన్ని పన్నాగాలు పన్నినా భయపడేది లేదని,ప్రజల పక్షాన నిలబడి కంపెనీ నిర్మాణం ఆపే వరకు నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ వేదిక కన్వీనర్ జిల్లాల పెంటయ్య,ఎండి రేహాన్, జినుకల ప్రభాకర్, జమీరుద్దీన్,బొడ్డుపల్లి వెంకటేశం,ఉట్కూరి నరసింహ,నకరికంటి మొగులయ్య,ఫజల్, అక్రమ్,పల్లపు దుర్గయ్య, గోదాసు పృథ్వీరాజ్, కొమ్ము శేఖర్,రాపోలు రమేష్,వనం అంజయ్య, గురుకు శివ,రాజు, కక్కిరేణి రవి తదితరులు పాల్గొన్నారు.