బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం అన్ని భాషలలోనూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
ఇక బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో కూడా 8 వ సీజన్ ప్రసారమవుతుంది.అయితే మొదట్లో ఉన్న విధంగా బిగ్ బాస్ కార్యక్రమ రూల్స్ ( Rules ) పెద్దగా పాటించడం లేదని తెలుస్తోంది.
ఒకప్పుడు హౌస్ లో పగలు నిద్రపోకూడదు, రెమ్యూనరేషన్ గురించి మాట్లాడకూడదు, కమ్యూనిటీ గురించి చర్చలకు కూడా తీసుకురాకూడదనే ఎన్నో నిబంధనలు ఉండేవి.
ఇటీవల కాలంలో బిగ్ బాస్ ఈ నిబంధనలన్నీ గాలికి వదిలేసారని తెలుస్తోంది.ఇటీవల హౌస్ లో నబీల్, మెహబూబ్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ముస్లిమ్స్ ఓట్లన్నీ మనకే అంటూ వీరిద్దరూ మాట్లాడుతున్న నేపథ్యంలో వీరిద్దరిని ముందు హౌస్ నుంచి బయటకు పంపించాలంటూ సోషల్ మీడియాలో నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
ఇక రెమ్యూనరేషన్ ( Remuneration ) గురించి కూడా బిగ్ బాస్ హౌస్లోనే కాదు బయట కూడా చెప్పకూడదనే నిబంధన ఉంది.కానీ ఈ రూల్ కూడా మణికంఠ ( Manikanta ) బ్రేక్ చేశాడు.ఈయన ఏకంగా బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ, హరితేజ, నభీల్, పృథ్వీ, మణికంఠ ఒక రూమ్ లో కూర్చుని మాట్లాడుతూ ఉండగా మణికంఠ మధ్యలో కలుగజేసుకొని వారానికి నాకు వచ్చేదే లక్ష రూపాయలు ఏం సరిపోతుంది అంటూ నోరు జారారు.దీంతో అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు.
ఇలా హౌస్ రూల్స్ ని బ్రేక్ చేస్తూ చాలా సంఘటనలు జరుగుతున్నాయి.ఇలా రూల్స్ పాటించకుండా కంటెస్టెంట్ లు ఉండడం పట్ల నాగార్జున( Nagarjuna )రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.