మంచి మనసు చాటుకున్న రామ్ చరణ్... చిన్నారికి పునర్జన్మ!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీ ( Mega family ) ఒకటి.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి( Chiranjeevi ) మంచి సక్సెస్ అందుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.

 Ramcharan Financial Support To Kid Health Treatment , Ramcharan, Financial Suppo-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ వేలకోట్లకు అదిపతి అయిన చిరంజీవి తన సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు ఏర్పాటు చేయడంతోపాటు ఎంతో మందికి ఆర్థిక సహాయం కూడా అందించారు.

ఇక చిరంజీవి బాటలోనే తన కుమారుడు రామ్ చరణ్ ( Ramcharan ) కూడా సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

Telugu Chiranjeevi, Financial, Ramcharan-Movie

నిజానికి రామ్ చరణ్ ఉపాసన ( Upasana )ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఎంతోమందికి ఆర్థిక సహాయం చేస్తున్నప్పటికీ ఎప్పుడు కూడా వారు చేసే సహాయాన్ని బయటకు చెప్పుకోలేదు.తాజాగా రామ్ చరణ్ మరో చిన్నారికి పునర్జన్మను అందించారు.తన తండ్రి చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22వ తేదీ జన్మించిన ఓ చిన్నారి పల్మనరీ హైపర్ టెన్షన్ అనే వ్యాధితో బాధపడుతోంది.

ఈ వ్యాధికి చికిత్స కోసం వారు హైదరాబాద్ అపోలోకి రాగా అక్కడ భారీ స్థాయిలో ఖర్చు అవుతుందని తెలుసుకున్నారు.

Telugu Chiranjeevi, Financial, Ramcharan-Movie

ఈ స్థాయిలో ఖర్చు తాము భరించలేమని ఆ తల్లిదండ్రులు వేడుకోవడంతో చరణ్ ఆ చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చును మొత్తం భరించి తనకు చికిత్స అందించారు.ప్రస్తుతం పాప ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే కాకుండా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడంతో ఈ విషయం తెలిసిన అభిమానులు రామ్ చరణ్ పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు .చరణ్ కేవలం నటనలో మాత్రమే కాదు సేవాగుణంలో కూడా తండ్రికి తగ్గ తనయుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube