మంచి మనసు చాటుకున్న రామ్ చరణ్… చిన్నారికి పునర్జన్మ!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీ ( Mega Family ) ఒకటి.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి( Chiranjeevi ) మంచి సక్సెస్ అందుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.

ఇలా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ వేలకోట్లకు అదిపతి అయిన చిరంజీవి తన సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు ఏర్పాటు చేయడంతోపాటు ఎంతో మందికి ఆర్థిక సహాయం కూడా అందించారు.

ఇక చిరంజీవి బాటలోనే తన కుమారుడు రామ్ చరణ్ ( Ramcharan ) కూడా సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

"""/" / నిజానికి రామ్ చరణ్ ఉపాసన ( Upasana )ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఎంతోమందికి ఆర్థిక సహాయం చేస్తున్నప్పటికీ ఎప్పుడు కూడా వారు చేసే సహాయాన్ని బయటకు చెప్పుకోలేదు.

తాజాగా రామ్ చరణ్ మరో చిన్నారికి పునర్జన్మను అందించారు.తన తండ్రి చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22వ తేదీ జన్మించిన ఓ చిన్నారి పల్మనరీ హైపర్ టెన్షన్ అనే వ్యాధితో బాధపడుతోంది.

ఈ వ్యాధికి చికిత్స కోసం వారు హైదరాబాద్ అపోలోకి రాగా అక్కడ భారీ స్థాయిలో ఖర్చు అవుతుందని తెలుసుకున్నారు.

"""/" / ఈ స్థాయిలో ఖర్చు తాము భరించలేమని ఆ తల్లిదండ్రులు వేడుకోవడంతో చరణ్ ఆ చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చును మొత్తం భరించి తనకు చికిత్స అందించారు.

ప్రస్తుతం పాప ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే కాకుండా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడంతో ఈ విషయం తెలిసిన అభిమానులు రామ్ చరణ్ పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు .

చరణ్ కేవలం నటనలో మాత్రమే కాదు సేవాగుణంలో కూడా తండ్రికి తగ్గ తనయుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చుండ్రుతో దిగులెందుకు.. పుదీనా ఉందిగా అండగా..!