పార్క్‌లో వాకింగ్.. గాయాలతో భారత సంతతి వృద్ధుడు మృతి, ఐదుగురు చిన్నారులు అరెస్ట్.. మిస్టరీ

ఇంగ్లాండ్‌లో( England ) విషాదం చోటు చేసుకుంది.లీసెస్టర్ నగరానికి సమీపంలోని తూర్పు ఇంగ్లాండ్ పట్ణణంలో ఓ పార్క్‌లో కుక్కను వాకింగ్ తీసుకొచ్చిన 80 ఏళ్ల భారత సంతతికి చెందిన వృద్ధుడు తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు.

 80 Years Old British-indian Man Dies After Assault 5 Children Arrested Details,-TeluguStop.com

ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఐదుగురు పిల్లలను అదుపులోకి తీసుకున్నారు.బాధితుడిని భీమ్ సేన్ కోహ్లీగా( Bhim Sen Kohli ) గుర్తించారు.

ఆయన బ్రౌన్‌స్టోన్ టౌన్‌లోని ఫ్రాంక్లిన్ పార్క్( Franklin Park ) వద్ద తన పెంపుడు కుక్కతో ఆదివారం రాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా దాడికి గురయ్యాడు.ఈ క్రమంలో సోమవారం రాత్రి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

Telugu Assault, Bhim Sen Kohli, Braunstone Town, British Indian, England, Frankl

లీసెస్టర్‌షైర్ పోలీసులు( Leicester Police ) పలు విచారణల తర్వాత 14 ఏళ్ల వయసు గల బాలుడు, బాలికను.12 ఏళ్ల వయసు గల బాలుడు, ఇద్దరు బాలికలను హత్య అనుమానంతో అరెస్ట్ చేశారు.బాధితుడి మరణం తర్వాత దీనిని హత్య కేసుగా మార్చినట్లు లీసెస్టర్‌షైర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎమ్మా మాట్స్ అన్నారు.దాడి వివరాలను నిర్ధారించడానికి పరిశోధకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆమె తెలిపారు.

ఘటనకు ముందు ఏం జరిగిందో తెలుసుకోవడానికి స్థానికుల సహాయం కోరినట్లు మాట్స్ పేర్కొన్నారు.

Telugu Assault, Bhim Sen Kohli, Braunstone Town, British Indian, England, Frankl

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.మృతుడు బ్లాక్ జంపర్, గ్రే జాగింగ్ బాటమ్స్ ధరించి తన పెంపుడు కుక్కును( Pet Dog ) తీసుకెళ్తున్నాడు.ఈ క్రమంలో బాలురు ఆయనపై దాడి చేసి పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఇంతలో డిటెక్టివ్‌లు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే పనిలో బిజీగా ఉన్నారు .సాధ్యమైనంత సమాచారాన్ని రాబట్టడానికి స్థానికులతో మాట్లాడుతున్నారు.ఘటనాస్థలి నుంచి మృతుడి ఇంటికి చేరుకోవడానికి 30 సెకన్లకు మించి సమయం పట్టదు.బాధితుడు చెట్టు కింద గాయాలతో పడి న్నాడని కోహ్లీ కుమార్తె చెప్పినట్లు లీసెస్టర్‌షైర్ లైవ్ పేర్కొంది.

దాదాపు 40 ఏళ్లుగా తాము ఇక్కడ నివసిస్తున్నామని.ఇటీవల ఈ ప్రాంతంలో సంఘ విద్రోహ ఘటనలు పెరిగాయని ఆమె తెలిపారు.

మృతుడు కోహ్లీకి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube