అమ్మ మాట-అంగన్వాడి బాట కార్యక్రమం ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలకేంద్రంలో అమ్మ మాట -అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్ వాడి టీచర్లు మాట్లాడుతూ అంగన్వాడి పాఠశాలల్లో కొత్త పాఠ్యప్రణాళిక రూపొందించడం జరిగిందని పిల్లలకు నాణ్యమైన చదువుతో పాటు ఆటలు పాటలు, కథలు, స్వేచ్ఛ, కలిపిస్తూన్నామని అలాగే ఉచిత భోజనం కూడా అందిస్తున్నామని అన్నారు.

 Amma Maata Anganwadi Baata Program Started, Amma Maata Anganwadi Baata , Rajanna-TeluguStop.com

అంగన్వాడి కేంద్రంలో మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసు గల పిల్లల్లో మేధో వికాస అభివృద్ధి నైతిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి వికసించే విధంగా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా బోధనా పద్ధతి రూపొందించామని అన్నారు.ప్రైవేటు పాఠశాలకు దీటుగా అంగన్వాడీ కేంద్రంలో విద్య నేర్పించబడుతుందని తల్లులకు ఇంటింటికి వెళ్లి గృహ సందర్శన ద్వారా వారికి అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు.

అంగన్వాడి సెంటర్లో కల్పిస్తున్న సేవలను వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు రాజ్యలక్ష్మి, రజిత,భవాని తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube