బాసర త్రిబుల్ ఐటీ కి ఎంపికైన విద్యార్థి ..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞానదీప్ పాఠశాలలో పదవ తరగతి చదివిన ఎం.శ్రీలేష్ గౌతమ్ బాసర త్రిబుల్ ఐటీ కి ఎంపికైనట్లు జ్ఞానదిప్ పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీనారాయణ తెలిపారు.అనంతరం ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్ , ఎస్ఐ ఎన్.రమాకాంత్ లు విద్యార్థి శ్రీలేష్ గౌతమ్ ను అభినందించారు.ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు.రాచర్ల బొప్పపూర్ జ్ఞానదీప్ హైస్కూల్ కు చెందిన విద్యార్థి శ్రీలేష్ గౌతమ్ పదవ తరగతిలో అత్యధిక మార్కులను సాధించి బాసర త్రిబుల్ ఐటీ లో సీటును సాధించాడు.

 Student Selected For Basara Iiit, Student , Basara Iiit, M Srilesh Gautam, Gnana-TeluguStop.com

ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ గౌడ్ , ఎస్ఐ ఎన్.రమాకాంత్ విద్యార్థి శ్రీలేష్ గౌతమ్ ను మేమంటో , శాలువాతో సన్మానించారు అనంతరం ఎస్ఐ రమాకాంత్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ సిబ్బందితో పాఠశాల నిర్వహిస్తున్న కరస్పాండెంట్ లక్ష్మినారాయణ ను అభినందించారు.పాఠశాల కరస్పాండెంట్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి సహకరిస్తున్న ఉపాధ్యాయినీ , ఉపాధ్యాయుల బృందానికి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube