విదేశీయులు చాలా ఖరీదైన రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లేదా టూరిస్ట్ ప్లేస్‌లకు వెళ్లకుండా, స్థానిక సంస్కృతిని అనుభవించడానికి భారతదేశానికి వస్తుంటారు.రీసెంట్‌గా మర్యా ( Marya ) అనే రష్యన్ అమ్మాయి ముంబైలో( Mumbai ) ఇలాంటి అనుభవానికి పొంది ఫిదా అయ్యింది.
ఆమె 12 లక్షల ఫాలోవర్స్ కలిగిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయన్సర్.
ఖరీదైన బ్యూటీ పార్లర్‌కు వెళ్లకుండా, ఆమె చిన్న బార్బర్ షాప్‌లో( Barber Shop ) తల మర్దన చేయించుకుంది.
ఈ హెడ్ మసాజ్( Head Massage ) ఎక్స్‌పీరియన్స్ కి సంబంధించి ఒక వీడియో కూడా షేర్ చేసుకోగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారింది.
తాజ్ మహల్‌ను సందర్శించడం, కొన్ని ఫన్నీ రీల్స్ చేయడం వంటి తన భారతదేశ పర్యటనలోని వివిధ కోణాలను పంచుకున్న మర్యాకు, ముంబైలోని తల మర్దన అత్యంత ప్రత్యేకమైన అనుభవంగా అనిపించింది.
ఆమె ఖార్ ప్రాంతంలో చిన్న రోడ్డుసైడ్ షాపు నడుపుతున్న సందీప్ శర్మ( Sandeep Sharma ) అనే బార్బర్ వద్దకు వెళ్లింది.సందీప్ ముందుగా తన చేతులతో మర్యా తలకు నూనె రాసి మర్దనా చేశాడు.
ఆ తర్వాత మరింత మర్దనా కోసం యంత్రాన్ని ఉపయోగించాడు.చివరిగా, ముక్కు మర్దనా చేయగా, మర్యా గట్టిగా తుమ్మింది.
ఆపై నవ్వింది.
హెడ్ మసాజ్‌లో భాగంగా, సందీప్ తన చేతులతో మర్యా తలను తట్టాడు, కనుబొమ్మలు, నుదుటిని నొక్కి మర్దనా చేశాడు.వీపు నొప్పి తగ్గించడానికి చివరగా ఆమె వీపును మర్దన చేసి ముగించాడు.వీడియోలో చూస్తే, మర్యా ఇలాంటి స్ట్రాంగ్ మసాజ్‌లకు అలవాటు పడలేదని స్పష్టంగా తెలుస్తోంది.
ఎందుకంటే బార్బర్ ఆమె తల, వీపుని కొట్టినప్పుడు అరుపులు మొదలుపెట్టింది.అయినా, తర్వాత ఆమె చాలా రిలాక్స్‌డ్‌గా ఫీల్ అయ్యింది.
సందీప్ నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ, ఇతరులు అతడి దుకాణానికి మసాజ్ కోసం వచ్చేలా ప్రోత్సహించింది.
మర్యా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ (@maryatheofficial)లో వీడియోను షేర్ చేస్తూ, భారతదేశంపై తన ప్రేమను వ్యక్తం చేసి, హెడ్ మసాజ్ అనుభవాన్ని రికమెండ్ చేసింది.ఈ వీడియో చాలా వేగంగా వైరల్‌గా మారి, 6 లక్షలకు పైగా వ్యూస్, అనేక కామెంట్‌లు వచ్చాయి.కొంతమంది ఇలా కొట్టించుకోవడానికి డబ్బులు ఇవ్వాలా అని ఆశ్చర్యంగా కామెంట్లు చేస్తే, మరికొందరు కేవలం ఎమోజుల ద్వారా నవ్వును పంచుకున్నారు.
ఈ మసాజ్ చాలా వెరైటీగా ఉందని మరి కొంతమంది పేర్కొన్నారు.