యాదాద్రి భువనగిరి జిల్లా:మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డి నోటిని యాసిడ్ తో కడిగిన తప్పులేదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మండిపడ్డారు.యాదగిరిగుట్టలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలేరులో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తన స్థాయికి మించి మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లిక్కర్ స్కాం,కాళేశ్వరం దోపిడి,ఫోన్ టాపింగ్ లాంటి అవినీతి ఆరోపణలతో పీకల్లోతు కూరుకుపోయి,మీరు చేసిన పాపాలను కడుగుతూ ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడానికి సిగ్గు ఉండాలన్నారు.ఫామ్ హౌస్ లో కెసిఆర్ కు మందులో సోడా పోసి మంత్రి పదవి తెచ్చుకున్న జగదీష్ రెడ్డి ఇప్పటికైనా అనుచిత వ్యాఖ్యలు మానేసి ప్రతిపక్ష పాత్ర పోషించాలని హితవు పలికారు.
సీఎం రేవంత్ రెడ్డిపై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని,లేనిపక్షంలో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.