పుచ్చకాయ( watermelon ).ప్రస్తుత సమ్మర్ సీజన్ లో ఈ ఫ్రూట్ ను మిస్ అవ్వగలమా నో ఛాన్స్.
వేసవికాలంలో బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడానికి, అతి దాహాన్ని తీర్చడానికి, ఎండలను తట్టుకుని నిలబడడానికి పుచ్చకాయ మనకు ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.పుచ్చకాయలో ఉండే పోషకాలు మన శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి.
నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తాయి.అందుకే వేసవి కాలంలో తప్పకుండా పుచ్చకాయను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటూ ఉంటారు.
అయితే పుచ్చకాయ తినే క్రమంలో గింజలు తీసి పారేయడం అందరికీ ఉన్న అలవాటు.కానీ పుచ్చకాయ మాత్రమే కాదు పుచ్చ గింజలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి.
ముఖ్యంగా పుచ్చ గింజలతో తయారు చేసే టీ హెల్త్( Tea Health ) పరంగా ఎన్నో అద్భుతమైన బెనిఫిట్స్ ను చేకూరుస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం పుచ్చ గింజలతో టీ ఎలా తయారు చేసుకోవాలి.? అసలు పుచ్చ గింజల టీ( watermelon Tea ) వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా పుచ్చగింజలు సేకరించి వాటర్ తో రెండు మూడు సార్లు వాష్ చేసుకుని పూర్తిగా ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో పుచ్చ గింజలు వేసి వేపుకోవాలి.మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్న పుచ్చ గింజలు మిక్సీ జార్ లో వేసి పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ పుచ్చ గింజల పొడి ( Pumpkin seed powder )వేసి 15 నిమిషాల పాటు మరిగిస్తే టీ సిద్ధం అవుతుంది.ఈ టీను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.
పుచ్చ గింజల టీను నిత్యం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.అలాగే పుచ్చ గింజల టీ ఎముకల్లో సాంద్రత పెరిగేలా ప్రోత్సహిస్తుంది.మోకాళ్ళ నొప్పులకు చెక్ పెడుతుంది.పుచ్చ గింజల టీను డైట్ లో చేయించుకోవడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గు ముఖం పడుతుంది.
జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.మరియు స్కిన్ హెల్త్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.