అమెరికా అధ్యక్ష ఎన్నికలు : నిధుల సేకరణలో వెనుకబడ్డ ట్రంప్.. బైడెన్‌కు పోటీ ఇచ్చేలా పావులు

అమెరికా అధ్యక్ష ఎన్నికల( US presidential election ) ప్రక్రియ మంచి జోరుమీదుంది.రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల తరపున డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌లు అధికారికంగా నామినేషన్ పొందారు.

 Donald Trump Is In ‘full Sprint' To Catch Joe Biden's Huge Election Fund Lead-TeluguStop.com

ఎన్నికల ప్రచారం కోసం ఇద్దరు నేతలు ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ఉద్ధృతం చేశారు.ఈ విషయంలో బైడెన్ దూకుడుకు కళ్లెం వేయాలని ట్రంప్ భావిస్తున్నారు.

ఈ వారమంతా ప్రధాన దాతలతో సమావేశాలు, సంభాషణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.నిధుల సమీకరణలో బైడెన్‌కు, తనకు మధ్య వున్న అసమతుల్యత గురించి ట్రంప్‌కు పూర్తిగా అవగాహన వుంది.

ఈ అంతరాన్ని పూడ్చేందుకు త్వరితంగా చర్యలు తీసుకుంటున్నారు.వీలైనంత ఎక్కువ మంది దాతల నుంచి నిధులను సేకరించడానికి ట్రంప్ ఇప్పటికే తన వంతు కృషి చేస్తున్నారని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.

అతని నిధుల సేకరణ యంత్రాంగం నిరంతరాయంగా ర్యాలీలు నిర్వహిస్తోందని పేర్కొంది.

Telugu Barack Obama, Clinton, Democratic, Donald Trump, Joe Biden, Republican, P

ఈ వీకెండ్‌లో పామ్ బీచ్ ఛారిటీ డిన్నర్ కనీసం 50 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ ఈవెంట్‌ను రహస్యంగా వుంచాలని భావిస్తున్నారు.జాతీయ, రాష్ట్ర పార్టీలతో భాగస్వామ్య ఖాతాల ద్వారా సంపన్న దాతల విస్తృతమైన నెట్‌వర్క్ నుంచి ప్రయోజనం పొందిన బైడెన్ కంటే.

ట్రంప్( Donald Trump ) నిధుల సేకరణ విషయంలో బాగా వెనుకబడి వున్నారు.న్యాయపరమైన ఇబ్బందుల్లో వున్న ట్రంప్ ఇటీవలే కోర్టుకు మిలియన్ డాలర్ల బాండ్‌ను సమర్పించారు.

ఇకపోతే.ఒక్క మార్చిలోనే జో బైడెన్ 90 మిలియన్ డాలర్లకు పైగా విరాళాలు సేకరించి, మొత్తంగా 192 మిలియన్ డాలర్ల నగదుతో ముందంజలో వున్నారు.

బైడెన్ బృందం అనుభవిస్తున్న బలీయమైన ఆర్ధిక ప్రయోజనం డెమొక్రాట్‌ల న్యూయార్క్ నిధుల సేకరణ కార్యక్రమం విజయవంతం కావడంపై మీడియా ఫోకస్‌తో పాటు రిపబ్లికన్ దాతలతో పోటీతత్వంగా వుండటానికి వేగంగా నిధులను సమీకరించే సామర్ధ్యాన్ని ప్రదర్శించే ఆవశ్యకతను పెంచిందని అంతర్గత వ్యక్తులు వెల్లడించారు.

Telugu Barack Obama, Clinton, Democratic, Donald Trump, Joe Biden, Republican, P

కాగా.ఈ వారం అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామాలు( Bill Clinton, Barack Obama ) బైడెన్ కోసం న్యూయార్క్‌లో సంయుక్తంగా ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు.తద్వారా రికార్డు స్థాయిలో 25 మిలియన్ డాలర్లను సేకరించారు.

ఇది బైడెన్‌కు కళ్లు చెదిరే మొత్తంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.డియో సిటీ మ్యూజిక్ హాల్‌లో జరిగిన ఫండ్ రైజింగ్ ఈవెంట్‌.

మూడు దశాబ్థాలకు చెందిన డెమొక్రాటిక్ నాయకత్వాన్ని ఒక వేదికపైకి చేర్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube