ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న హరీష్ శంకర్.. జాతకం మారడం పక్కా అంటూ?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ,( Ravi Teja ) శంకర్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా మిస్టర్ బచ్చన్.( Mr Bachchan ) భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్ట్ 15, 2024 న విడుదల కానుంది.

 Harish Shankar About Movie With Ram Details, Ram Pothineni, Tollywood, Harish Sh-TeluguStop.com

అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్స్ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ని విడుదల చేస్తున్నారు.మరోవైపు సినిమా ప్రమోషన్స్ ని కూడా మొదలుపెట్టారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ టీజర్ కట్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది.అయితే ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయిన డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ మేరకు రామ్ పోతినేని తో( Ram Pothineni ) కలిసి చేయబోతున్న సినిమాపై స్పందిస్తూ.

రామ్ తో సినిమా చేయబోతున్నా, జవాన్ కృష్ణమ్మ చిత్రాల ప్రొడ్యూసర్ తో సినిమా ఉండబోతుందని తెలిపారు.అయితే రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ తో( Double Ismart ) మిస్టర్ బచ్చన్ ను రిలీజ్ చేయడం అన్ అవయిడబుల్ సిట్యువేషన్ అని తెలిపారు.

అంతేకాక డబుల్ ఇస్మార్ట్ , మిస్టర్ బచ్చన్ రెండూ కూడా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను అని హరీష్ శంకర్ తెలిపారు.కాగా ఈ సందర్బంగా హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే శంకర్ హీరో రామ్ తో సినిమాను కన్ఫర్మ్ చేయడంతో అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.కాగా ప్రస్తుతం రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

గతంలో విడుదల ఇస్మార్ట్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube