అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ . జో బైడెన్‌కు( Joe Biden ) షాక్ తగిలింది.
ముస్లిం సోదరుల పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా వైట్‌హౌస్‌లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.అయితే దీనిని చాలామంది ముస్లిం కమ్యూనిటీ నేతలు తిరస్కరించడం చర్చనీయాంశమైంది.
గాజాలో ఇజ్రాయెల్( Israel in Gaza ) చర్యలకు జో బైడెన్ మద్ధతుగా నిలవడం పట్ల అసంతృప్తిగా వున్న ముస్లిం లీడర్లు మంగళవారం సాయంత్రం ఇఫ్తార్ విందుకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు.పాలస్తీనియన్లను ప్రభావితం చేస్తున్న ముట్టడిపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
రంజాన్ ఈవెంట్ చుట్టూ వున్న వివాదాన్ని గుర్తించిన వైట్‌హౌస్ .వార్షిక ఇఫ్తార్ మహోత్సవాన్ని రద్దు చేసింది.సిబ్బందికి చిన్న విందు, ముస్లిం కమ్యూనిటీ నేతలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో అధ్యక్షుడు జో బైడెన్ , ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ , ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
సమావేశానికి హాజరైన వారు గాజాలో తమ అనుభవాలను పంచుకున్నారు.ఓ వైద్యుడు .ఈ యుద్ధ క్షేత్రంలో పిల్లల ఫోటోలను చూపారు.బైడెన్, కమలా హారిస్‌లు ( Kamala Harris )వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించేలా చొరవ చూపాలని వారు కోరారు.
తక్షణ, శాశ్వత కాల్పుల విరమణ కోసం పిలుపునివ్వడం గురించి ప్రశ్నించగా.బందీల ఆందోళనల కారణంగా ఇజ్రాయెల్ ప్రతిఘటిస్తుందని బైడెన్ చెప్పారు.
సుమారు ఆరు నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత పాలస్తీనా సంతతి అమెరికన్ వైద్యుడు డాక్టర్ అహ్మద్ తాను సమావేశం నుంచి నిష్క్రమించడానికి గల కారణాలను పంచుకున్నారు.నా సంఘం పట్ల గౌరవం, బాధలో వున్న వ్యక్తుల కోసం ఈ ఈవెంట్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందన్నారు.అయితే డాక్టర్ అహ్మద్ భావాలను తాను అర్ధం చేసుకున్నట్లు బైడెన్ చెప్పినట్లుగా నివేదిక పేర్కొంది.కాగా.గాజా వివాదంపై అసంతృప్తిని పరిష్కరించడానికి బైడెన్ పరిపాలనా యంత్రాంగం ముస్లిం నాయకులతో పలు సమావేశాలు నిర్వహించింది.అధ్యక్షుడి వైఖరి.
యువకులు, నల్లజాతి ఓటర్లు, అభ్యుదయవాదులతో సహా బైడెన్ శిబిరంలోని కీలక సమూహాలను కలవరపరిచింది.