జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఇంకా జరగకపోవడంతో కొన్ని కొన్ని కీలక నియోజకవర్గల్లో జనసేన పోటీ చేసే విషయంలో క్లారిటీ రావడం లేదు.జనసేన( Janasena )లో చేరేందుకు చాలా మంది నాయకులు ఉత్సాహం చూపిస్తున్నా, సీటు విషయంలో పవన్ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతే పార్టీలో చేరి యాక్టివ్ అవ్వాలని భావిస్తున్నారు.
ఇక ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుంచి చాలామంది నేతలే వచ్చి పార్టీలో చేరారు.వారిలో కొంతమందికి సీటు హామీని ఇచ్చారు.
ఇదేవిధంగా ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉంటూ కొంతకాలంగా పొలిటికల్ గా సైలెంట్ గా ఉంటున్న మాజీమంత్రి కొణతాల రామకృష్ణ( Konathala Ramakrishna ) తో పవన్ కళ్యాణ్ తాజాగా భేటీ అయ్యారు.
విశాఖ పర్యటన( Pawan Kalyan ) లో భాగంగా కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్లిన పవన్ ఆయనతో తాజా రాజకీయ అంశాల పైన చర్చించారు.దాదాపు 50 నిమిషాల పాటు పవన్ కొణతాల రామకృష్ణ వివిధ అంశాలపై చర్చించుకున్నారు.వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా నాగబాబు( Naga Babu ) పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది .దీనికి తగ్గట్లుగానే ఆయన అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ మధ్య కాలంలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.పార్టీ తరఫున నిర్వహించే కార్యక్రమాలకు కొణతాల రామకృష్ణను ఆహ్వానిస్తున్నా, కొణతాల మాత్రం ఆ సమావేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు.
అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ( Anakapalli assembly ) స్థానం నుంచి కొణతాల రామకృష్ణను పోటీ చేయాల్సిందిగా నాగబాబు సూచించినా, కొణతాల మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు.అంతే కాకుండా అనకాపల్లి నియోజకవర్గంలో రెండు చోట్ల నాగబాబు సమావేశాలు నిర్వహించారు.దీనికి కొణతాల ను ఆహ్వానించినా ఆయన హాజరు కాలేదు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కొణతాల రామకృష్ణతో భేటీ అయ్యి, తాజా రాజకీయాలపై చర్చించడం ,అలాగే సీటు విషయంలో ఆయనకు క్లారిటీ ఇవ్వడంతో కొణతాల యాక్టివ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.