ఉత్తరాంధ్ర నుంచి జనసేన ఎన్నికల శంఖారావం..!!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) సమీపిస్తున్న నేపథ్యంలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని జనసేన పార్టీ భావిస్తోంది.ఈ మేరకు ఉత్తరాంధ్ర( Uttarandhra ) నుంచి జనసేన ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని భావిస్తోంది.

 Janasena Pawan Kalyan Special Focus On Uttarandhra,uttarandhra,janasena, Pawan K-TeluguStop.com

ఇందులో భాగంగా వచ్చే నెల 4న అనకాపల్లిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్( Janasena Pawan Kalyan ) భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని తెలుస్తోంది.

ఆ తరువాత అమలాపురం, తెనాలితో పాటు మచిలీపట్నం( Machilipatnam )లో జనసేనాని సభలను ఏర్పాటు చేయనున్నారు.కాగా పవన్ కల్యాణ్ బహిరంగ సభల షెడ్యూల్ ను జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఇవాళ విడుదల చేయనున్నారని తెలుస్తోంది.అలాగే సభ ఏర్పాట్లపై రేపు అనకాపల్లిలో పార్టీ నేతల సన్నాహక సమావేశం జరగనుంది.

అనకాపల్లి భారీ బహిరంగ సభ వేదికపైనే మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ( Former MP Konathala Ramakrishna ) జనసేన పార్టీలోకి చేరనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube