వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. థర్డ్ పార్టీ యాప్ లకు కూడా మెసేజ్ పంపోచ్చు..!

ప్రస్తుతం వాట్సప్( Whatsapp ) ద్వారా కేవలం వాట్సాప్ కు మాత్రమే మెసేజ్ చేసే అవకాశం ఉండేది.కానీ ఇకపై వాట్సప్ ద్వారా థర్డ్ పార్టీ మెసేజ్ యాప్( third party messaging app ) ల నుండి వచ్చే మెసేజ్ లతో ఇంటరాక్ట్ అయ్యేలా యూజర్లను అనుమతించడానికి కూడా వాట్సాప్ ఓ సరికొత్త ఫీచర్ ని పరిచయం చేయనుంది.

 A New Feature In Whatsapp You Can Also Send Messages To Third Party Apps , Inter-TeluguStop.com

కొత్త ఫీచర్ కి సంబంధించిన వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

వాట్సప్ యొక్క iOS యాప్ బీటా వెర్షన్లో థర్డ్ పార్టీ చాట్స్ అని పిలువబడే ఒక కొత్త టెస్టింగ్ ఫీచర్ కనిపించింది.వాట్సప్ కార్డ్ పార్టీ చాట్ లు అనే కొత్త ఫీచర్ ను అభివృద్ధి చేస్తోంది.ఇకపై టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్ లను ఉపయోగించి వాట్సాప్ లో ఇతర వ్యక్తులతో కమ్యూనికేట్ చేయవచ్చు.

వాట్సప్ ఈ ఫీచర్ ను పరిచయం చేయడానికి కారణం ఏమిటంటే.వివిధ యాప్లను ఉపయోగించే స్నేహితులను సులభంగా కనెక్ట్ అవ్వడం కోసమే.

ఇంటర్ ఆపరబిలిటీ ఫీచర్( Interoperability feature ) థర్డ్ పార్టీ మెసేజ్ యాప్ లో ఎవరైనా వాట్సప్ ఖాతా లేకుండా కూడా వాట్సప్ వినియోదారులకు సందేశాలను పంపించడానికి వీలు కల్పిస్తుంది.ఈ ఇంటర్ ఆపరబిలిటీ సేవను మ్యానువల్ గా తమంతట తాము ప్రారంభించాలి.ఒకవేళ నిలిపివేయడానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది.ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వారి కమ్యూనికేషన్ ప్రాధాన్యతలు మరియు ప్రైవసీ సెట్టింగ్లపై నియంత్రణ కూడా కలిగి ఉంటారు.

వాట్సప్ తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.ఇటీవలే వాట్సప్ ఛానల్ కోసం సరికొత్త ఫీచర్లను పరిచయం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube