పద్మ పురస్కారం భారత ప్రభుత్వంచే అందించబడే అత్యున్నత పురస్కారంలో ఒక పురస్కారం.వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు, మొదలగు వాటిలో విశిష్ట సేవ చేసినవారికి ప్రాథమికంగా ఇచ్చే ఈ పౌరపురస్కారం 1954, జనవరి 2న నెలకొల్పబడింది.
ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవానికి( Republic Day ) ఒకరోజు ముందు అనగా జనవరి 25వ తారీఖున కేంద్రం పద్మ అవార్డులను ప్రకటిస్తోంది.
రేపు రిపబ్లిక్ డే నేపథ్యంలో ఈరోజు కూడా పద్మా పురస్కారాలకు సంబంధించి ఎంపికైన వారి పేర్లు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.ఈ క్రమంలో ప్రకటించిన లిస్టులో ముగ్గురు తెలుగు వాళ్ళకి పద్మశ్రీ( Padma Shri ) లభించింది.పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణకు చెందిన నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి బుర్ర వీణ వాయిద్య కారుడు దాసరి కొండప్పను,( Dasari Kondappa ) అలాగే, జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు( Gaddam Sammaiah ) సైతం కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది.
ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి( Uma Maheshwari ) పద్మశ్రీ అవార్డు వరించింది.అలాగే కళలు విభాగంలో బిహార్ కి చెందిన భార్యాభర్తలు శాంతిదేవి పాశ్వాన్, శివన్ పాశ్వాన్కు, త్రిపురకు చెందిన చక్మా రేఖాకు కేంద్రం పద్మశ్రీని ప్రకటించింది.గతేడాది ప్రభుత్వం నూట ఆరు మందికి పద్మా అవార్డులను ప్రకటించింది.కాగా ఈసారి మొత్తం 34 మందికి అవార్డులను ప్రకటించడం జరిగింది.ఇందులో మూడు అవార్డులు తెలుగు వారికి లభించాయి.