మీ జుట్టు రోజు రోజుకు పల్చగా మారుతుందా.? జుట్టు ఎదుగుదలను ఎలా పెంచుకోవాలో అర్థం కావడం లేదా.? ఖరీదైన ఆయిల్ వాడిన ప్రయోజనం ఉండటం లేదా.? వర్రీ వద్దు నిజానికి మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలతో సులభంగా మరియు వేగంగా జుట్టును ఒత్తుగా మార్చుకోవచ్చు.ముఖ్యంగా కరివేపాకు, అల్లం( Curry leaves, ginger ) జుట్టు ఎదుగుదలను అద్భుతంగా ప్రోత్సహిస్తాయి.ఈ రెండిటిని ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే ఎంత పల్చగా ఉన్న జుట్టు అయినా సరే నెల రోజుల్లో ఒత్తుగా మారుతుంది.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో ఒక కప్పు ఫ్రెష్ కరివేపాకు మరియు రెండు స్పూన్లు తరిగిన అల్లం ముక్కలు వేసి 15 నిమిషాల పాటు ఉడికించాలి.
ఇలా ఉడికించిన కరివేపాకు మరియు అల్లం ముక్కలను వాటర్ తో సహా మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా ఒక మంచి హెయిర్ టోనర్ సిద్ధం అవుతుంది.ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు తయారు చేసుకున్న టోనర్ ను స్ప్రే చేసుకోవాలి.40 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ విధంగా కనుక చేస్తే కరివేపాకు, అల్లం లో ఉండే పోషకాలు హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేస్తాయి.అదే సమయంలో జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారుతుంది.అలాగే ఈ హెయిర్ టోనర్ ను వాడటం వల్ల చుండ్రు సమస్య దూరం అవుతుంది.
జుట్టు త్వరగా తెల్లబడకుండా సైతం ఉంటుంది.