ఈ ఇద్దరి లక్ష్యం జగనే ! 

త్వరలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు( AP Elections ) జరగబోతున్నాయి.ఈ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

 Ap Bjp Chief Purandheswari Congress Ys Sharmila Target Is Jagan Details, Jagan,-TeluguStop.com

తాము ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని , ఏ పార్టీతోను పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని , ఇప్పటికే వైసిపి అధినేత , ఏపీ సీఎం జగన్( CM Jagan ) ప్రకటించారు.టిడిపి ,జనసేనలు ఉమ్మడిగా ఎన్నికల సమరంలోకి దిగబోతున్నాయి.

ఈ రెండు పార్టీల లక్ష్యం జగనే.ఇక జాతీయ పార్టీ కాంగ్రెస్ లక్ష్యం కూడా జగన్ ను ఓడించడమే.

అందుకే ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షురాలుగా జగన్ సోదరి వైఎస్ షర్మిలను( YS Sharmila ) నియమించారు.జగన్ పార్టీకి పడే ఓట్లను చీల్చడమే లక్ష్యంగా ఆమెకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు.

ఇక మరో జాతీయ పార్టీ అయిన బిజెపి కి ఏపీ అధ్యక్షురాలుగా దగ్గుపాటి పురందరేశ్వరి ఉన్నారు.వైసిపి తో పాటు,  టిడిపిని లక్ష్యంగా చేసుకుని బిజెపి ఏపీ అధ్యక్షురాలిగా పురేందరేశ్వరి నియామకాన్ని చేపట్టారు.

Telugu Ap, Ap Bjp, Ap Cm Jagan, Ap Congress, Cmjagan, Jagan, Janasena, Sharmila,

ప్రధానంగా టిడిపికి అనుకూలంగా ఉండే కమ్మ సామాజిక వర్గం నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పురందరేశ్వరి కి ( Purandareswari ) ఆ బాధ్యతలను అప్పగించారు .అయితే ఆమె మాత్రం అధికార పార్టీ వైసీపీని( YCP ) ఎక్కువ టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు .టిడిపి విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే ఫిర్యాదులు ఆమె ఉన్నాయి.వచ్చే ఎన్నికల్లో ఆమె ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినందుకు సిద్ధమవుతుండగా, కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వైఎస్ షర్మిల ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం షర్మిల, పురందేశ్వరి ల ఏకైక లక్ష్యం జగన్ ను ఓడించడమే.

Telugu Ap, Ap Bjp, Ap Cm Jagan, Ap Congress, Cmjagan, Jagan, Janasena, Sharmila,

ఆ ఉద్దేశంతోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్న షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో పాటు,  ఆ పార్టీని విలీనం చేసుకున్నారు.ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు.షర్మిల ప్రభావం రాయలసీమ జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తుందని, జగన్ కు. వైసిపికి ఆ ప్రాంతం లో అనుకూలంగా పడే ఓట్లలో చీలిక వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ,బిజెపిలు రెండు జగన్  టార్గెట్ గా వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి .ప్రస్తుతానికి రెండు పార్టీల మహిళ అధ్యక్షురాళ్ల ఏకైక లక్ష్యం జగన్ పార్టీని ఒడించడమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube