మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ను బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు.ఈ మేరకు హైదరాబాద్ లో బాలినేనితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రకాశం జిల్లాలోని వైసీపీలో నెలకొన్న ప్రతిష్టంభనకు చెక్ పెట్టేందుకు సజ్జల, విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారని సమాచారం.అయితే బాలినేని డిమాండ్ చేస్తున్న ఒక్క ఎంపీ సీటు తప్ప మిగతా డిమాండ్లకు వైసీపీ సానుకూలం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
బాలినేనికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే నష్టపోతామని వైసీపీ భావిస్తోంది.మరోవైపు ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డిని నియమించనున్నారనే వార్త జోరుగా సాగుతోంది.