మామిడి తోటలను( Mango plantations ) సాగు చేసి ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొందాలంటే.మామిడి చెట్ల పూతను, పిందెలను పూర్తిగా సంరక్షించుకోవాలి.
ఈ పూత, పిందెలకు ఏవైనా చీడపీడలు లేదా తెగుళ్లు ఆశిస్తే సకాలంలో యాజమాన్య పద్ధతులను ఉపయోగించి వాటిని పూర్తిగా అరికట్టాలి.మామిడి తోటలను ఆశించి తీవ్ర నష్టం కలిగించే చీడపీడలలో పూత పురుగులు( Coated insects ) కీలక పాత్ర పోషిస్తాయి.
అరుదుగా కనిపించే ఈ పురుగు ఈ ఏడాది ఉధృతంగా మామిడి తోటలను ఆశించినట్లు వ్యవసాయ క్షేత్ర నిపుణులు గుర్తించారు.మామిడి చెట్టు పూత దశలో ఉన్నప్పుడు పూత రెమ్మలను పూర్తిగా తొలిచేసి ఊహించని విధంగా ఈ పురుగులు నష్టపరుస్తున్నాయి.
కొందరు రైతులు పూత రెమ్మలు మాడిపోవడానికి కారణం వాతావరణ మార్పులు అని అపోహ పడుతున్నారు.ఒకసారి పూత రెమ్మలను జాగ్రత్తగా గమనిస్తే పూత పురుగులను గుర్తించవచ్చు.అరుదుగా కనిపించే ఈ పూత పురుగులు ఈ ఏడాది ఉధృతంగా పూతను ఆశించి నష్టపరుస్తున్నాయి.రైతులు కాస్త జాగ్రత్తగా ఉంటే పంట దిగుబడులు సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది.మామిడి చెట్లకు ఇప్పుడిప్పుడే పూత గెలలు బయటకు వస్తున్నాయి.పూత రాలిపోకుండా, పూతకు చీడపీడలు ఆశించకుండా ఎప్పటికప్పుడు పూతను గమనిస్తూ ఉండాలి.
ఈ పూత పురుగులను మామిడి చెట్లపై గుర్తించిన తరువాత 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్( Monocrotophos ) ను ఒక లీటరు నీటిలో కలిపి మామిడి చెట్లపై ఉండే పూత పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.ఈ పురుగుల ఉధృతి అధికంగా ఉంటే 1మి.లీ డైక్లోరోవాస్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి మామిడి చెట్ల పూతను సంరక్షించుకోవాలి.అప్పుడే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.