రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అధికారులతో బుధవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి గత సంవత్సరాలలో నమోదైన వివిధ రకాల నేరాలకు సంబంధించిన విషయాలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది.పెండింగ్లో వున్న కేసులకు సంబందించిన స్థితిగతులను సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు,కేసులు పెండింగ్ లో లేకుండా వేగంగా నాణ్యమైన దర్యాప్తును పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.
కేసుల యొక్క విచారణ విషయంలో పారదర్శకంగా పనిచేస్తూ బాధితులకు భరోసా కలిగే విధంగా స్పందించాలని అధికారులకు ఎస్పీ గారు సూచించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… పోలీస్ అధికారులు, సిబ్బంది భవిష్యత్తులో ఎదురైయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ నూతనోత్సాహంతో ముందుకు సాగుతూ ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించాలన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా విజుబుల్ పోలిసింగ్ కీలకం,విజుబుల్ పోలీసింగ్ లో భాగంగా విలేజ్ పోలీస్ అధికారులు, పెట్రో కార్, బ్లూ కోల్ట్ సిబ్బంది తరచు గ్రామాలను పర్యటిస్తూ ప్రజల్లో భద్రత భావాన్ని పెంపొందించాలన్నారు.గత సంవత్సరంలో మహిళా రక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతూ అభయ అప్, బస్ లో భరోసా , ఆపరేషన్ జ్వాల కార్యక్రమాలు పకడ్బంది గా అమలు చేయాలన్నారు.
జిలాల్లో కొత్తగా వచ్చిన ప్యాసింజర్ వాహనాలను గుర్తించి అభయ యాప్ పకడ్బందిగా అమలు చేయాలని,బస్ లో భరోసా కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్ లలో సీసీ కెమెరాలతో పాటుగా షీ టీమ్ నెంబర్ తో ఉన్న పోస్టర్ విజుబుల్ ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లాలో మాధకద్రవ్యాలను నిర్ములించడమే లక్ష్యంగా ప్రతి ఒక్క అధికారి పని చేస్తూ గంజాయి రహిత జిల్లాగా మార్చలని ,యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి విద్యార్థినీ, విద్యార్థుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ క్లబ్స్ పక్కాగా అమలు చేసి మాధకద్రవ్యాల వల్ల కలుగు అనార్ధాల పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయలన్నరు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అధికారులు తగు చర్యలు తీసుకోవడం పాటు రోడ్డు ప్రమాదాలపై లోటు విశ్లేషణ చేసిన నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచరి, రవికుమార్, సి.ఐ లు ,ఎస్.ఐ లు,ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.