మహిళలు ఆర్టీసీకి సహకరించండి:ఆర్టీసీ ఎండి సజ్జనార్ విజ్ఞప్తి

మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మహిళలకు కీలక సూచన చేశారు.తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌ బస్సు ల్లో ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం దృష్టి కి వచ్చిందని తెలిపారు.

 Women Help Rtc: Rtc Md Sajjanar Appeals , Rtc Md Sajjanar, Rtc-TeluguStop.com

దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని చెప్పారు.తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని ఆర్టీసీ ఎండీ కోరారు.

మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తు న్నారని, దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతోందని చెప్పు కొచ్చారు.ఇక నుంచి ఎక్స్‌ ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగు తుందని, దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహక రించాలని మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

నాలుగైదు నెలల్లో 2 వేలకుపైగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసు కొస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు.అందులో 400 ఎక్స్‌ప్రెస్‌లు, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు ఉన్నట్టు చెప్పారు.

ఎలక్ట్రిక్ వాహనాలను.హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సు లను వాడకంలోకి తీసు కొస్తామని క్లారిటీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube