ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్( Salaar ) మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది.అయితే సలార్ టీజర్ లో టిన్నూ ఆనంద్ చెప్పిన డైలాగ్స్ సినిమాలో లేకపోవడం ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది.
ఆ సీన్ సినిమాలో ఎందుకు లేదనే ప్రశ్నకు ప్రభాస్ నుంచి సమాధానం వస్తే బాగుంటుందని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.సినిమాపై అంచనాలు పెంచిన ఆ సీన్ ఎక్కడంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
సలార్ పార్ట్2 గురించి క్లారిటీ రావాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందేనని చెప్పవచ్చు.సలార్ విషయంలో ప్రేక్షకుల్లో నెలకొన్న ఎన్నో సందేహాలకు చెక్ పడాలంటే సలార్2 మూవీ విడుదలయ్యే వరకు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.
ప్రశాంత్ నీల్ తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారని సమాచారం అందుతోంది.సలార్ సక్సెస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.
సలార్ సినిమాలో రాధా రమా మన్నార్ పాత్రలో నటించి శ్రియా రెడ్డి( Sriya Reddy ) ఆ పాత్రతో ఆకట్టుకున్నారు.బాహుబలికి శివగామి పాత్ర ఏ విధంగా హైలెట్ గా నిలిచిందో సలార్ కు ఆమె పాత్ర అదే స్థాయిలో హైలెట్ అయింది.జగపతిబాబు రాజమన్నార్ పాత్రలో నటించి ఆ పాత్రకు జీవం పోశారనే చెప్పాలి.సలార్ కోసం ఎంతోమంది టెక్నీషియన్స్ పని చేశారు.ఆ టెక్నీషియన్స్ అంతా ఈ సినిమాకు న్యాయం చేశారనే చెప్పాలి.
ప్రశాంత్ నీల్ తన డైరెక్షన్ లో తెరకెక్కే ప్రతి సినిమాకు ఎంచుకునే నటీనటుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.సలార్ సినిమాకు 350 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగింది.నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.8 వారాల తర్వాత ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.సలార్1 తో పోల్చి చూస్తే సలార్2 ( Salaar2 )మూవీ ఊహించని స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది.