పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటున్న రిషబ్ శెట్టి.. ఈ స్టార్ హీరో నిజంగా గ్రేట్ అంటూ?

తెలుగు సిని ప్రేక్షకులకు కన్నడ హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి( Director Rishabh Shetty ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు రిషబ్ శెట్టి.

 Rishab Shetty Adopts Govt School In His Native Village , Rishab Shetty, Adopts G-TeluguStop.com

చిన్న సినిమాగా విడుదల అయిన కాంతార సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.పాన్ ఇండియా సినిమా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ అద్భుతమైన విజయాన్ని సాధించింది.

అన్ని భాషల్లో ఈ చిత్రం 300 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.ఇక డిజిటల్, శాటిలైట్ హక్కుల లెక్క వేరే.

ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు రిషబ్ శెట్టి.

Telugu Adopts School, Native, Rishab Shetty-Movie

ప్రస్తుతం రిషబ్ శెట్టి పార్ట్ కాంతార 2( Kantara 2 ) లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ అందరిలో ఆసక్తి పెంచేసింది.ఇది ఇలా ఉంటే తాజాగా రిషబ్ శెట్టికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే కాగా రిషబ్ శెట్టి స్వగ్రామం కెరటి దక్షిణ కర్ణాటకలో ఉంది.తాజాగా రిషబ్ శెట్టి తన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలని దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది.రిషబ్ శెట్టి ఈ ఏడాది చారిటి ట్రస్ట్ కూడా ప్రారంభించారు.తన ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆదివారం రోజు రిషబ్ శెట్టి కెరటిలో పాఠశాలని సందర్శించాడు.

Telugu Adopts School, Native, Rishab Shetty-Movie

పాఠశాలని దత్తత తీసుకోవడం పై రిషబ్ ఉపాధ్యాయులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.రిషబ్ శెట్టి తాను పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటున్నారు అంటూ గ్రామ పెద్దలు నాయకులు అభినందిస్తున్నారు.అంతేకాకుండా రిషబ్ శెట్టి చేస్తున్న పనిని చూసి అభిమానులు కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇకపోతే అభిమానులు కాంతార 2 సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగు శరవేగంగా జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube