మాస్ మహారాజా రవితేజ( Raviteja ) స్పీడ్ ను ఏ హీరో కూడా తట్టుకోలేడు.ఈయన వరుసగా నాలుగైదు సినిమాలు ప్రకటిస్తూ వాటిని ఒకదాని వెంట ఒకటి పూర్తి చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకు పోతుంటాడు.
మరి ప్రస్తుతం చేతిలో రెండు మూడు సినిమాలు ఉండగానే ఈ రోజు మరో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ తో అందరికి సర్ప్రైజ్ ఇచ్చాడు.
ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు సినిమా( Tiger Nageswara Rao ) రిలీజ్ కాగా పర్వాలేదు అనిపించుకుంది.ఇక ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టులను కూడా వేగంగా ఫినిష్ చేస్తున్నాడు.కార్తీక్ ఘట్టమనేనితో చేసిన ఈగల్ సినిమా ( Eagle Movie ) సంక్రాంతికి రిలీజ్ కానుండగా గోపీచంద్ మలినేని సినిమాను ఇటీవలే మొదలెట్టాడు.
ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఈ రోజు తనకు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ తో మరో మూవీ ప్రకటించాడు.హరీష్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి అంచనాలు భారీగా పెరిగాయి.కాగా ఈ రోజు టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు.”మిస్టర్ బచ్చన్” అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.
ఈ టైటిల్ మాత్రమే కాదు ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంటుంది.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రవితేజ స్కూటర్ నడుపుతూ కనిపించగా బ్యాక్ గ్రౌండ్ లో అమితాబ్ లోగో కనిపిస్తుంది.మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.కాగా ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.