తప్పు చేసినట్లు క్రియేట్ చేస్తున్నారు..: యూట్యూబర్ నాని

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చోటు చేసుకున్న ప్రమాదంపై యూట్యూబర్ లోకల్ బాయ్ నాని స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఏ తప్పు చేయలేదని తెలిపారు.

 Creating By Mistake..: Youtuber Nani-TeluguStop.com

ఈనెల 19వ తేదీ రాత్రి తన స్నేహితులకు పార్టీ ఇచ్చి ఇంటికి వచ్చానన్న నాని తరువాత బోట్లు తగలబడుతున్నాయని రాత్రి 11.46 గంటలకు ఫోన్ వచ్చిందని తెలిపారు.దాంతో వెంటనే హార్బర్ వద్దకు వెళ్లినట్లు చెప్పారు.అగ్నిప్రమాద ఘటన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే వీడియో తీశానన్నారు.మత్స్యకారులకు మేలు జరగాలనే వీడియో తీశానన్న ఆయన డబ్బులు సంపాదించాలనే ఆలోచన తనకు లేదని పేర్కొన్నారు.కానీ బోట్లు తానే తగలబెట్టానని పోలీసులు కొట్టారని ఆరోపించారు.

తాను తప్పు చేసినట్లు క్రియేట్ చేస్తున్నారని వాపోయారు.హైకోర్టులో పిటిషన్ వేయగానే తనను బెదిరించారని తెలిపారు.

ఈ క్రమంలో గంగ పుత్రులు నిజాలు తెలుసుకోవాలని కోరారు.తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube