బాడీ ఎప్పుడు వీక్ గా ఉంటుందా.. అయితే ఈ ఆహారాలు తప్పక తీసుకోండి!

సాధారణంగా ఒక్కోసారి బాడీ చాలా వీక్ గా( Body weakness ) తయారవుతుంది.ఏ పని చేయలేకపోతుంటారు.

 These Are The Best Foods To Get Rid Of Body Weakness , Bananas , Stamina-TeluguStop.com

ఎందులోనూ మనసు పెట్టలేకపోతుంటారు.ఎప్పుడు కూడా మంచానికే అతుక్కుపోతుంటారు.

మీరు ఈ లిస్టులో ఉన్నారా.అయితే మీరు మీ బాడీకి అవసరమయ్యే పోషకాలను అందించడం లేదు.

పోషకాల కొరత కారణంగానే శరీరం బలహీనపడుతుంది.అలాంటి సమయంలో సరైన డైట్ పాటించకపోతే రకరకాల జబ్బులు తలుపు తడతాయి.

అందుకే వీక్ గా ఉన్న మీరు బాడీని స్ట్రాంగ్ గా మార్చుకోండి.అందుకు ఇప్పుడు చెప్పబోయే ఆహారాలు సహాయపడతాయి.

అవేంటో మరి చూసేయండి.

Telugu Weakness, Tips, Latest, Nuts, Peanut Butter, Staminabooster, Weak-Telugu

గుడ్డు పోషకాలకు పవర్ హౌస్ అని చెప్పవచ్చు.ముఖ్యంగా గుడ్డు( Egg )లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.రోజుకు ఒకటి లేదా రెండు ఉడికించిన గుడ్లను తింటే శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి.

దీంతో బాడీ వీక్ నెస్ దూరం అవుతుంది.అలాగే స్టామినాను బిల్డ్ చేసుకోవడానికి అరటి పండ్లు( Bananas ) కూడా ఉత్తమమైన ఆహారంగా చెప్పుకోవచ్చు.

ఏడాది పొడవునా దొరికే అరటి పండ్లను రోజుకు ఒకటి చొప్పున‌ తీసుకోండి.అరటి పండ్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటాయి.

Telugu Weakness, Tips, Latest, Nuts, Peanut Butter, Staminabooster, Weak-Telugu

శరీర బలహీనతను నివారించడానికి నట్స్ ( Nuts )కూడా అద్భుతంగా హెల్ప్ చేస్తాయి.రోజుకు గుప్పెడు నట్స్ ను తీసుకుంటే ఎలాంటి వీక్ నెస్ అయినా పరారవుతుంది.బాదం, పిస్తా, వాల్ నట్స్, జీడిపప్పు, బ్రెజిల్ నట్స్ వంటి వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేయండి.

ఇక పీనట్ బటర్ బాడీని చాలా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.పీనట్ బటర్ తీసుకుంటే బరువు పెరుగుతామని ఎక్కువ శాతం మంది భావిస్తుంటారు.కానీ మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు.పైగా పీనట్ బటర్ లో ప్రోటీన్ మరియు గుడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి.

అందువల్ల నిత్యం ఒకటి లేదా రెండు స్పూన్లు పీనట్ బటర్ ను తీసుకోండి.శరీర బలహీనతను తరిమి కొట్టండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube