భారత్ లోని అహ్మదాబాద్ లో ఉండే నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నవంబర్ 19వ తేదీ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా( India vs Australia ) ఫైనల్ మ్యాచ్ జరుగునున్న సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్ ను 1,32,000 మంది ప్రేక్షకులు మైదానంలో కూర్చుని వీక్షించనున్నారు.
అతిరథ మహారథులు ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ( World Cup Final Match ) వేడుకకు హాజరు కాబోతున్నారు.ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు అంగరంగ వైభవంగా వేడుకలను బీసీసీఐ నిర్వహించనుంది.
క్రికెట్ అభిమానులంతా ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సమయంలో ఓ కొత్త విషయం అందరినీ కలవరపెడుతోంది.
భారత జట్టుకు అస్సలు అచ్చిరాని అంపైర్( Umpire ) వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో అంపైరుగా వ్యవహరించబోతున్నాడట.ఇతను అంపైరింగ్ చేసిన ఏ ఐసీసీ టోర్నీ నాకౌట్ మ్యాచ్లలో కూడా భారత జట్టు విజయం సాధించలేదు.అందుకే భారత క్రికెట్ అభిమానులు ఈ అంపైర్ ను భారత జట్టుకు ఐరన్ లెగ్ అంపైర్ గా భావిస్తున్నారు.
ఇంతకీ ఆ అంపైర్ ఎవరంటే.రిచార్డ్ కెటిల్ బరో.( Richard Kettleborough ) ఈ అంపైర్ 2014లో టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు అంపైరింగ్ చేశాడు.ఆ మ్యాచ్లో భారత్ ఓటమిని చవిచూసింది.2016 టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో ఇతనే ఎంపైర్ గా వ్యవహరించాడు.ఆ మ్యాచ్ లో కూడా భారత్ ఓడిపోయింది.
2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2017 వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లకు ఇతనే అంపైరింగ్ చేశాడు.ఆ మ్యాచ్లలో కూడా భారత్ ఓడిపోయింది.ఇక 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో కూడా ఇతనే అంపైరింగ్ చేయగా.ఈ మ్యాచ్ లో కూడా భారత్ ఓడిపోయింది.అయితే ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు కూడా ఇతనే అంపైరింగ్ చేస్తున్నాడనే వార్త తెలియడంతో క్రికెట్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.నిన్నటిదాకా ఈ టోర్నీ టైటిల్ భారత్ దే అని అనుకున్నా అభిమానులు, మ్యాచ్లో ఏం జరుగుతుందో అనే ఆందోళన కాస్త కలవర పెడుతుంది అని చెప్పాలి.