Mangalavaaram Review: మంగళవారం సినిమా రివ్యూ అండ్ రేటింగ్!

డైరెక్టర్ అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) నటించిన చిత్రం మంగళవారం(Mangalavaaram).ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో ఆర్ఎక్స్ 100 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఇక తాజాగా మంగళవారం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Payal Rajput Ajay Bhupathi Mangalavaaram Movie Review And Rating-TeluguStop.com

ఈ సినిమా నేడు (నవంబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ద్వారా పాయల్ హిట్ కొట్టిందా అనే విషయానికి వస్తే…

కథ:

మహాలక్ష్మి పురం అనే గ్రామంలో రాత్రి సమయంలో వింత శబ్దాలు వస్తుంటాయి.ఒక మహిళ నెత్తిన పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది.ఈ సినిమాలో శైలజ (పాయల్ రాజ్ పుత్)( Shailaja ) రవి(చైల్డ్ ఆర్టిస్ట్) మంచి స్నేహితులు.శైలజ అమ్మ చనిపోవడంతో నాన్న రెండో పెళ్లి చేసుకుంటుంది.దీంతో అమ్మమ్మ వద్ద పెరుగుతుంటుంది.

తనకు అన్ని రకాలుగా అండగా ఉన్నటువంటి రవి ( Ravi ) వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి మంటల్లో కాలిపోయి చనిపోతారు.అప్పటినుంచి శైలజ ఒంటరిగా ఉంటుంది.

తర్వాత శైలజ ఉన్నటువంటి ఊర్లో పేర్లు మంగళవారం రోజు గోడపై రాసి వారిద్దరికీ అక్రమ సంబంధం ఉందని రాసి ఉంటుంది మంగళవారం ఊరు చివర బావి వద్ద ఆత్మహత్య చేసుకుని చనిపోతారు.ఆ ఊరి జమీందారీ ప్రకాషం బాబు(చైతన్య కృష్ణ) ఆదేశాలప్రకారం చనిపోయిన వారికి పోస్ట్ మార్టం చేయడానికి లేదు.

మరో మంగళవారం కూడా అలాంటిదే గోడపై రాస్తారు,ఆ జంట ఆత్మహత్య చేసుకుంటారు.రంగంలోకి దిగిన ఎస్‌ఐ మీనా(నందితా స్వేత)( Nandita Swetha ) ఇది హత్యలే అని నిర్థారిస్తుంది.

ఇక ఆ ఊరి ఆర్ఎంపీ డాక్టర్ పూరి చివర భావి వద్ద శైలజను దయ్యం రూపంలో చూశానని చెబుతాడు మరి ఈ ఊర్లో హత్యలు జరగడానికి కారణం ఏంటి నిజంగానే ఆ ఊరిలో దయ్యం ఉందా అసలు మంగళవారం రోజు ఇలా హత్యలు జరిగి చనిపోవడానికి కారణం ఏంటి అనేదే ఈ సినిమా కథ.

Telugu Ajay Bhupathi, Payal Rajput, Mangalavaaram, Mangalavaram, Nandita Shweta,

నటీనటుల నటన:

పాత్రలో పాయల్ ఎంతో అద్భుతంగా నటించారు.ఈమె తన నటన ద్వారా అందరిని మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు.మిగిలిన నటీనటులందరూ కూడా వారి పాత్రలకు పూర్తిగా జీవం పోసారని చెప్పాలి.

టెక్నికల్:

మంగళవారం సినిమా ద్వారా అజయ్ భూపతి మరోసారి తన మార్క్ ఏంటో చూపించారు.అద్భుతమైన స్క్రీన్ ప్లే కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా థ్రిల్లింగ్ కలిగేలా చేశారు.

మొత్తం ఒక భయానకంతో కూడుకున్నప్పటికీ సినిమా పట్ల ఆసక్తిని రేకెత్తించేలా సన్నివేశాలు ఉన్నాయి.అయితే అక్కడక్కడ కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి కానీ సినిమా మాత్రం అందరిని ఆకట్టుకునేలా ఉంది.

ఇక ఈ సినిమాకు మ్యూజిక్ ( Music ) కూడా చాలా ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి.

Telugu Ajay Bhupathi, Payal Rajput, Mangalavaaram, Mangalavaram, Nandita Shweta,

విశ్లేషణ:

ఈ సినిమా ట్రైలర్ టీజర్ చూస్తే ఇది ఒక హర్రర్ సినిమా( Horror Movie ) అనుకోవచ్చు కానీ ఈ సినిమాలో కూడా చాలా మంచి సందేశం ఉందని డైరెక్టర్ చూపించారు.సినిమాలో గ్రామ దేవత, థ్రిల్లర్‌ ఎలిమెంట్ల బ్యాక్‌ డ్రాప్‌లో అదిరిపోయే అక్రమ సంబంధాల కథని చెప్పాడు దర్శకుడు భూపతి ఎన్నో ట్విస్టులను పెట్టారు.దీనికి తోడు అతి శృంగార కోరికలు అనే కాన్సెప్ట్ కూడా చూపించారు.అయితే ఇలాంటి సినిమాలు చేయాలి అంటే కాస్త సాహసం అనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:

హీరోయిన్ నటన, కథ, ట్విస్టులు, సంగీతం

Telugu Ajay Bhupathi, Payal Rajput, Mangalavaaram, Mangalavaram, Nandita Shweta,

మైనస్ పాయింట్స్:

భయంకరమైన సన్నివేశాలు పెద్దగా సింక్ అవలేదు, ఆయిల్ బోల్డ్ సీన్స్ కాస్త శృతి మించాయని చెప్పాలి.అక్కడక్కడ కొన్ని సన్నివేశాలను సాగదీశారు.

బాటమ్ లైన్:

ఇలాంటి తరహా సినిమాలు ఇదివరకే ఎన్నో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం థ్రిల్లర్ సినిమాగా మరోవైపు కాస్త బోల్డ్ సన్నివేశాలను కూడా చూపించారు.ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ అనిపించకుండా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.మొత్తానికి బోర్ కొట్టకుండా ఈ సినిమాని ఒకటికి రెండుసార్లు చూడవచ్చు.

రేటింగ్: 2.75/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube