మనలో చాలామంది మనకు ఉన్న సమస్యలను చాలా పెద్ద సమస్యలుగా భావిస్తారు.కొంతమంది అనుభవించే సమస్యలతో పోల్చి చూస్తే మాత్రం ఆ సమస్యలు చాలా చిన్న సమస్యలు అని చెప్పవచ్చు.
చిన్నప్పటి నుంచి ఎముక విరుపు వ్యాధితో ( osteoporosis )బాధ పడుతున్న ధన్య ( dhanya )తన సక్సెస్ తో ప్రశంసలు అందుకుంటున్నారు.ధన్య తన ఎముకలు బలహీనం అయినా సంకల్పం మాత్రం గొప్పదని ప్రూవ్ చేస్తున్నారు.
కేరళకు ( Kerala )చెందిన ధన్యారవికి బాల్యంలోనే అరుదైన ఆరోగ్య సమస్య వచ్చింది.జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.తన జీవితానికి అర్థం, పరమార్థం ఉండాలని భావించిన ధన్యా రవి అరుదైన వ్యాధులపై అందరిలో అవగాహన కల్పించడం మొదలుపెట్టారు.కేరళలో పుట్టిన ధన్య ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడ్డారు.
ఆస్టియోజెనెసిస్ ఇంపర్ఫెక్టా( Osteogenesis imperfecta ) అనే అరుదైన ఎముక విరుపు వ్యాధితో ఆమె బాధ పడుతున్నారు.

ఈ వ్యాధి వల్ల ధన్యారవికి చిన్న వయస్సులోనే దగ్గినా, తుమ్మినా శరీరంలోని ఎముకలు విరిగేవి.ఎముకలు విరగడం వల్ల ధన్యారవి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.జీవితంలో ఎన్నో గడ్డు పరిస్థితులను ధన్యారవి ఎదుర్కొన్నారు.
ఛాట్ ఫోరమ్స్( Chat forums ) ద్వారా స్నేహితులను సంపాదించుకున్న ధన్య బినూ అనే బాలుడు తనలాంటి ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నాడని తెలిసి బినూ వైద్య చికిత్స కోసం నిధులు సమకూరేలా చేశారు.

బినూ ( Binoo )చక్రాల కుర్చీపై కూర్చుని తన పనులు తాను చేసే స్థితికి ధన్యా రవి తీసుకొచ్చారు.ఆ తర్వాత బినూ అరుదైన వ్యాధులతో బాధ పడుతున్న వాళ్లలో మరింత స్పూర్తి నింపే దిశగా అడుగులు వేస్తున్నారు.ఒక స్వచ్చంద సంస్థలో చేరిన ధన్య అరుదైన ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
విదేశాలకు వెళ్లి స్పూర్తిదాయక ప్రసంగాలు ఇస్తూ ధన్య కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదగడంతో పాటు తన మంచి మనస్సును చాటుకుంటున్నారు.







