తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్( Mega Power Star ) గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ ( Ramcharan )గురించి మనందరికీ తెలుసు.ఆయన ఇండస్ట్రీ లో వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఆయనకంటూ సెపరేట్ గా ఒక స్టైల్ ని ఏర్పాటు చేసుకొని ఆ స్టైల్ లోనే సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకెళ్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ చేసిన అన్ని సినిమాలు తమదైన మార్క్ గుర్తింపు సంపాదించుకుంటున్నాయి.
ఇక రీసెంట్ గా ఆయన చేసిన త్రిబుల్ ఆర్ సినిమా అయితే పాన్ ఇండియా వైస్ గా సూపర్ సక్సెస్ అయింది.ఇక ఇప్పుడు ఆయన శంకర్( Shankar ) డైరెక్షన్ లో గేమ్ చెంజార్ అనే సినిమా చేస్తున్నాడు.అయితే రామ్ చరణ్ వైఫ్ అయిన ఉపాసన రామ్ చరణ్ సినిమా గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ సినిమాల్లో రంగస్థలం ముందు వరకు ఆయన చేసిన సినిమాల్లో చిరుత, మగధీర సినిమాలు మాత్రమే తనకు నచ్చేవంట మిగతా సినిమాలన్నీ రొటీన్ స్టోరీ ఫార్ములా తో సాగే సినిమాలు కావడం వల్ల తనకి ఎక్కువగా నచ్చేవి కాదట దాంతో రామ్ చరణ్ చేసే సినిమాలు చూసేవారు కాదంట.
కానీ ఎప్పుడైతే రంగస్థలం సినిమా( rangasthalam ) వచ్చిందో అప్పటి నుంచి రాంచరణ్ సినిమాలు అంటే ఆమెకు విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది అంట దాంతో సుకుమార్ గారికి థాంక్స్ కూడా చెప్పినట్టుగా తెలియజేశారు.ఇక రంగస్థలం సినిమా తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా అయితే తనకు అమితమైన ఇష్టం అంటూ ఇప్పటికీ ఆ సినిమాని చాలాసార్లు చూశాను అంటూ చెబుతూనే ఆ సినిమాలో ఎన్టీఆర్ కూడా చాలా అద్భుతమైనటువంటి నటన కనబరిచారు అంటూ చెప్పింది.ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమా షూటింగ్ పూర్తి అయిపోతే నెక్స్ట్ బుచ్చి బాబు సినిమా మీదికి వెళ్లిపోవాలని చూస్తున్నాడు.