విశ్వరూప మహాసభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై ప్రధాని మోదీ సీరియస్ వ్యాఖ్యలు..!!

హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాదిగ ఉప కులాల విశ్వరూప సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దళితులను చిన్నచూపు చూసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంబేద్కర్ నీ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ఓడించిందని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సెంట్రల్ హాల్ లో అంబేద్కర్ ఫోటో కూడా పెట్టలేదు.

భారతరత్న కూడా ఇవ్వలేదు.మేం అధికారంలోకి వచ్చాకే అంబేద్కర్ ఫోటో పెట్టం.

భారతరత్న ఇచ్చాం.ఇండియా కూటమికి దళిత నాయకులంటే చిన్న చూపు.

అని కీలక వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని పేర్కొన్నారు.

ఆ రెండు పార్టీలు కలిసిపోయాయని సంచలన ఆరోపణలు చేశారు.

మరి కొద్ది రోజుల్లో తెలంగాణలో జరగబోయే ఎన్నికలలో ఆ రెండు పార్టీలు ఒకవైపు.బీజేపీ మరోవైపు అని మోదీ వ్యాఖ్యానించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీతో కలిసి నాటకాలు ఆడుతోంది అని అన్నారు.

బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వంతో కలిసి అవినీతి చేస్తున్నారని అని.సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికలలో ఆ రెండు పార్టీల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కూడా పాల్గొనడం జరిగింది.ఇంకా తెలంగాణ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube