ఈ ఏడాది బాలీవుడ్( Bollywood ) ని షారుఖ్ ఖాన్ శాసించాడు అనే చెప్పాలి.ప్రారంభం లో ‘పఠాన్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన షారుఖ్ ఖాన్, రీసెంట్ గా జవాన్( Jawan ) చిత్రం తో మరోసారి వెయ్యి కోట్ల రూపాయిల మార్కు ని అందుకున్నాడు.
ప్రస్తుతానికి బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ స్టార్ స్టేటస్ కి దరిదాపుల్లో కూడా ఏ హీరో లేదు.సల్మాన్ ఖాన్( Salman Khan ) గత దశాబ్దం మొత్తం షారుఖ్ ఖాన్ పై డామినేషన్ చూపించాడు.
కానీ కరోనా పీరియడ్ తర్వాత సల్మాన్ ఖాన్ రేంజ్ బాగా తగ్గిపోయింది అని 12 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ‘టైగర్ 3 ‘ ( Tiger 3 )మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే అర్థం అవుతుంది.అసలు ఈ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అసలు ఇది నిజంగా సల్మాన్ ఖాన్ సినిమానేనా అనే సందేహం రాక తప్పదు.
కంటెంట్ తో సంబంధం లేకుండా బాలీవుడ్ లో ఓపెనింగ్స్ పెట్టే ఏకైక సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాత్రమే.అలాంటి సల్మాన్ ఖాన్ టైగర్ సిరీస్ కి సీక్వెల్ చేస్తున్నాడు అంటే అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ టైం రికార్డు లెవెల్ లో ఉండాలి.కానీ ఈ చిత్రానికి అలా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.పైగా ఈ చిత్రం షారుఖ్ ఖాన్ 20 నిమిషాల పాత్రని పోషించాడు.అలాగే రీసెంట్ గా హృతిక్ రోషన్ కూడా ముఖ్య పాత్రలో కనిపిస్తాడు అని తెలిసింది.ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలతో పాటుగా, మన టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Young Tiger NTR )కూడా క్లైమాక్స్ లో కలిపించబోతున్నట్టు తెలుస్తుంది.
ఇంత మంది స్టార్స్ ఉన్నారు అని అంటున్నా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కదలడం లేదు.ఈరోజు మొత్తం సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పేరు ని సోషల్ మీడియా లో తెగ వాడేసుకున్నారు.
ఎన్టీఆర్ ప్రభావం వల్ల సౌత్ లో అయిన ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ లో ఎదుగుదల కనిపిస్తుందో లేదో చూడాలి.ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టీ చూస్తుంటే ఈ చిత్రానికి మొదటి రోజు ఇండియా లో 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.దివాళీ రోజు ఇంత తక్కువ వసూళ్లు అంటే సల్మాన్ ఖాన్ రేంజ్ బాగా తగ్గిపోయింది అనే భావన కలుగుతుంది అంటున్నారు విశ్లేషకులు.ఇక ఓవర్సీస్ గురించి చెప్పనవసరం లేదు, కనీస స్థాయి బుకింగ్స్ ని కూడా దక్కించుకోలేకపోయింది ఈ చిత్రం.
రేపు ఏమైనా ఇంప్రూవ్ ఉంటుందో లేదో చూడాలి.