మల్లెపూల సాగులో ఎరువుల యాజమాన్యంలో పాటించాల్సిన మెళుకువలు..!

మల్లెపూలకు ( Jasmine flowers )మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండే ఉంటుంది.కొన్ని సరైన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించుకొని ఈ మల్లెపూల పంటను సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు.

 Techniques To Be Followed In The Management Of Fertilizers In Jasmine Cultivati-TeluguStop.com

జనవరి నుంచి యాజమాన్య పద్ధతులను పాటిస్తే పూల నాణ్యత ఆశాజనంగా ఉంటుంది.మల్లె పూల సాగులో కోమ్మ కత్తిరింపుల తోనే అధిక పూల దిగుబడి సాధించవచ్చు.

నవంబర్ నుంచి మల్లెపూల మొక్కలకు( Jasmine flowers ) నీరు అందించకుండా నీటి ఎద్దడికి గురిచేసి ఆకులు రాలేలా చేయాలి.జనవరి నెలలో దాదాపుగా మొక్కలకు ఉండే ఆకులు చాలా వరకు రాలిపోతాయి.

ఆ తర్వాత కొమ్మలను మొత్తం ఒక తాడుతో కడితే ఆకులు పూర్తిగా రాలిపోతాయి.

Telugu Agriculture, Cattle Manure, Jasmine Crop, Jasmine, Jasmine Flowers, Rythu

ఆకులు రాలిన ఐదు సంవత్సరాల లోపు ఉండే మొక్కల కొమ్మలను భూమి నుంచి రెండు అడుగులు ఉంచి పై భాగాలను కత్తిరించాలి.బలహీనంగా ఉండే ఎండు కొమ్ములను పూర్తిగా తొలగించాలి.కొమ్మ కత్తిరింపుల తర్వాత ఒక తేలికపాటి నీటి తడి అందించాలి.

ఆ తరువాత ఒక వారం రోజులకు ఒక్కొక్క చెట్టుకు పది కిలోల పశువుల ఎరువు( Cattle manure ), 500 గ్రాముల వేపపిండి, 200 గ్రాముల అమోనియం సల్ఫేట్, 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 75 గ్రాముల మ్యురేట్ ఆఫ్ పోటాష్ ఎరువులను మొక్కలకు అందించాలి.ముందు చెట్టు చుట్టూ చిన్న గాడి తీసి అందులో ఈ ఎరువులు వేసి మట్టితో కప్పి ఉంచి ఆ తర్వాత నీటి తడి అందించాలి.

ఇలా చేస్తే మొక్కకు కావాల్సిన పోషకాలు అన్ని సంపూర్ణంగా అంది పూల దిగుబడి పెరుగుతుంది.

Telugu Agriculture, Cattle Manure, Jasmine Crop, Jasmine, Jasmine Flowers, Rythu

పంట కోతకు వస్తే.ఉదయం 11:00 లోపు మాత్రమే పూల కోతలు చేయాలి.కోతలు జరిపిన వెంటనే పూలను మార్కెట్కు తరలించాలి.

కోత కోసిన పూలు రెండు లేదా మూడు రోజుల వరకు తాజాగా ఉండాలంటే ఒక లీటరు నీటిలో 10 గ్రాముల సుక్రోస్ ను కలిపి ఆ ద్రావణంలో ఒక పది నిమిషాలు పూలను ఆనబెట్టి ఆ తరువాత కాస్త ఆరిన వెంటనే ప్యాకింగ్ చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube