సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రేంజ్ ఇమేజి ఉన్న అతి తక్కువ మంది స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సమంత.( Samantha ) ఇండస్ట్రీ లోకి వచ్చి దశాబ్ద కాలం దాటింది.
ఈమెతో పాటు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వాళ్లలో ఎంతోమంది హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అయిపోయారు.కానీ సమంత ఇప్పటికీ క్రేజీ స్టార్ గా కొనసాగుతూనే ఉంది.
అందం తో పాటుగా అద్భుతమైన నటన ప్రతిభ ఉండడం వల్లే ఆమె నేడు ఈ స్థాయిలో ఉందని అంటున్నారు అభిమానులు.ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి మెప్పించే టాలెంట్ ఉన్న సమంత ప్రస్తుతం సినిమాలకు తాత్కాలిక విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకుంటుంది.
ఎందుకంటే ఆమె రీసెంట్ గానే ‘మయోసిటిస్’ వ్యాధి కి ట్రీట్మెంట్ చేయించుకుంది.డాక్టర్లు ఏడాది పాటు రెస్ట్ తీసుకోవాలి అని సూచించడంతో ఆమె నిర్ణయం తీసుకుంది.
ఇకపోతే సమంత ఎన్నో బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఆమె ఒక హాలీవుడ్ మూవీ కి ప్రొమోషన్స్ చేయబోతుంది.మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి ‘ది మార్వెల్స్’( The Marvels ) అనే చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాకి సంబంధించిన తెలుగు వెర్షన్ ప్రొమోషన్స్ కి సమంత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.
మార్వెల్ స్టూడియోస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన ఈ సినిమాకి సమంత లాంటి స్టార్ ప్రమోట్ చెయ్యడం అనేది సాధారణమైన విషయం కాదు.గతం లో ఆమె ‘కెప్టెన్ మార్వెల్‘ సినిమాకి కూడా ప్రమోటర్ గా నిల్చింది.
హాలీవుడ్ ప్రఖ్యాత సంస్థ సమంత క్రేజ్ ని గుర్తించి, తమ సినిమాకి ఈమె మాత్రమే తెలుగు లో హైప్ తీసుకొని రాగలదు అని నమ్మరంటే సమంత కి ఉన్న బ్రాండ్ ఇమేజి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.ఇకపోతే రీసెంట్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో రిపోర్టర్స్ తనని అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది.
ఒక రిపోర్టర్ మాట్లాడుతూ ‘తెలుగు లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లాగ ఒక సూపర్ హీరో సిరీస్ ని నిర్మిస్తే మీరు సూపర్ హీరోలు గా ఎవరిని ఎంచుకుంటారు’ అని అడగగా, దానికి సమంత సమాధానం చెప్తూ ‘ప్రస్తుతానికి నాకు అల్లు అర్జున్ అంటే పిచ్చి, అతనే నా సూపర్ హీరో, ఆయనతో పాటుగా విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda )కూడా’ అంటూ సమాధానం ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేసింది.సమంత నుండి ఇంత బోల్డ్ స్టేట్మెంట్స్ అభిమానులు సైతం ఊహించలేకపోయారు.ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.