కాంగ్రెస్ ను అలా దెబ్బకొట్టబోతున్న కేసీఆర్ ! సీనియర్ల కు ఇబ్బందే ?

తమకు ప్రధాన ప్రత్యర్థగా మారిన కాంగ్రెస్ ప్రభావాన్ని తగ్గించేందుకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM kcr )సరికొత్త వ్యూహాలు అమలు చేసేందుకు నిర్ణయించుకున్నారు.దీనిలో భాగంగానే కాంగ్రెస్ కంచు కోటలుగా ఉన్న నియోజకవర్గాలతో పాటు,  ఆ పార్టీ సీనియర్ నాయకులు పోటీ చేయబోతున్న నియోజకవర్గలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

 Kcr Is Going To Hit The Congress Like That! Is It A Problem For Seniors , Tela-TeluguStop.com

దీనిలో భాగంగానే ముందుగా ఉమ్మడి నల్గొండ జిల్లా పై కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలకు చెక్ పెట్టే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్( BRS ) పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు.రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు,  ఉమ్మడి ఖమ్మం జిల్లా పై కాంగ్రెస్ కు  గట్టి పట్టు ఉంది.

  నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ కీలక నేతలంతా ఇక్కడే ఉన్నారు.  ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి తో పాటు,  పార్లమెంట్ సభ్యులు ,పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి , కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ( Komatireddy Venkat Reddy )మాజీమంత్రి దామోదర్ రెడ్డి వంటివారు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Telugu Congress, Jana, Telangana-Politics

 కాంగ్రెస్ కూడా చేరికలపైనే ఎక్కువగా ఫోకస్ చేయడంతో పాటు, బిఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసుకుంది.బీఆర్ఎస్ లో చేరిన నాలుగు నెలలకే భువనగిరికి చెందిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని  కాంగ్రెస్ లో చేర్చుకుంది.అలాగే మునుగోడు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరినా, ఆయన మళ్లీ కాంగ్రెస్ లో చేరడంతో మునుగోడు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు.  ఇక సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జానారెడ్డి మినహా మిగిలిన వారంతా అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్నారు .జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి ఈసారి నాగార్జునసాగర్ నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు.అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం ఇక్కడ బాగా కనిపించింది .ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేతలు అసెంబ్లీకి పోటీ చేయడంతో, వారికి బిఆర్ఎస్ గట్టి షాక్ ఇచ్చింది.జానారెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి,  రామిరెడ్డి దామోదర్ రెడ్డిలను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించింది.

కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్గొండ జిల్లా పై మంత్రి జగదీష్ రెడ్డి ( Jagadish Reddy )ప్రత్యేకంగా దృష్టి సారించి బిఆర్ఎస్ కు తిరుగులేకుండా చేశారు.  ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది .రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 12 అసెంబ్లీ స్థానాలను తామే గెలుచుకోవాలనే పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది.ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రభావం ఏ మాత్రం కనిపించకుండా చేసేందుకు కేసిఆర్ ప్రత్యేక దృష్టి సారించారు.

Telugu Congress, Jana, Telangana-Politics

ఉద్యమకారులైన జిట్టా బాలకృష్ణారెడ్డి , చెరుకు సుధాకర్లను పార్టీలో చేర్చుకున్నారు.మరి కొంతమంది కాంగ్రెస్ నేతలను బీ ఆర్ ఎస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.మూడోసారి హ్యాట్రిక్ సొంతం చేసుకోవాలంటే ఏ ఒక్క నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా అన్ని నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని , పూర్తిగా అభ్యర్థులపైనే భారం వేయకుండా బీఆర్ఎస్ కీలక నాయకులందరినీ రంగంలోకి దింపి అన్ని నియోజకవర్గాల్లోనూ ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు ఉండేలా కెసిఆర్ ప్లాన్ చేసుకున్నారు .దీనిలో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీగా చేరుకులు ఉండేలా మంత్రి జగదీష్ రెడ్డి ( Jagadish Reddy )తో పాటు,  ఆ పార్టీ ఎమ్మెల్యేలు దృష్టి ధరించారు.ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ ( CM kcr )పర్యటనలు చేపట్టారు.ఎనిమిది నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించి దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ప్రతి బహిరంగ సభలో స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.ఇదేవిధంగా కాంగ్రెస్ కు పట్టు ఉన్న మిగతా నియోజకవర్గాల పైన దృష్టి పెట్టాలని,  కాంగ్రెస్ కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో భారీగా ఆ పార్టీ నుంచి వలసలు ఉండేలా చూసుకుని, ఓడించడమే లక్ష్యంగా కేసీఆర్ పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube