తెలంగాణ లో ఇప్పుడు ఆంధ్ర పార్టీల మనుగడ చాలా కష్టం అయిపోయింది.ఈ ప్రాంతం లో తెలుగు దేశం పార్టీ కి ఒకప్పుడు పటిష్టమైన ఓట్ బ్యాంక్ ఉండేది.
కానీ తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత క్రమంగా ఆ పార్టీ బలం తగ్గుతూ ఇప్పుడు సున్నా అయిపోయింది.నవంబర్ లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు అధికారిక ప్రకటన కూడా చేసింది టీడీపీ పార్టీ( TDP party ).ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రాంతం లో ఉన్న తెలుగు దేశం పార్టీ అభిమానులు మరియు కార్యకర్తలకు అవమానకరం అనే చెప్పాలి.ఇక వైసీపీ పార్టీ కూడా ఈ ఎన్నికలకు దూరం గా ఉంది కానీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మాత్రం ఎన్నికల బరిలో నిలబడి పోటీ చేయబోతుంది.
వాస్తవానికి పవన్ కళ్యాణ్ కి తెలంగాణ ఎన్నికలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పోటీ చెయ్యడం ఇష్టం లేదు.కానీ ఆయన పై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడడం తో సరైన నిర్ణయం తీసుకోలేని స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనే విషయం అర్థం అవుతుంది.
ఆ ప్రాంతం లో ఉండే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అభిమానులు మరియు కార్యకర్తలు తెలంగాణ లో పోటీ చెయ్యమని పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారు.ఇక్కడ జనసేన పార్టీ రాక కోసం ప్రజలు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్నారని, గత ఎన్నికలలో లాగ కాకుండా ఈసారి గౌరవనీయమైన సీట్లతో జనసేన పార్టీ అభ్యర్థులను తెలంగాణ అసెంబ్లీ లోకి అడుగుపెట్టేలా చేస్తామని తెలంగాణ జనసేన కార్యకర్తలు మరియు ముఖ్యమైన నాయకులు పవన్ కళ్యాణ్ తో సమావేశమై చర్చించారు.34 స్థానాల్లో పోటీ చెయ్యడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం అయ్యాడు, కానీ ఇంతలోపే బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని కలిసి పొత్తు తో ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన గురించి చర్చించారు.దీనిపై ఢిల్లీ వెళ్లి అమిత్ షా(Amit Shah ) తో కూడా చర్చలు జరిపారు.
కానీ పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ మీడియా కి రాలేదు.
ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్( Andhra Pradesh ) లో మిత్రపక్షం లో ఉన్న టీడీపీ పార్టీ తెలంగాణ ఎన్నికల నుండి తప్పుకుంటున్నాము అని అధికారిక ప్రకటన చెయ్యడం తో జనసేన కూడా పోటీ నుండి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే దాని ప్రభావం కచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై కూడా పడుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం.ప్రస్తుతానికి అయితే జనసేన పార్టీ కి పోటీ చేసే గెలిచేంత బలం తెలంగాణ ప్రాంతం లో లేదు కానీ ఓటు బ్యాంక్ మాత్రం ఉంది.
గెలవము అని తెలిసి కూడా ఎందుకు పోటీ చెయ్యడం అని కొంతమంది అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.మరి తెలంగాణ లో పోటీ ఉందా లేదా అనేది నవంబర్ 1 వ తేదీన తెలియనుంది.