మెగా ఫ్యామిలీలో( Mega Family ) మరో హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.కెరీర్ లో ఫుల్ స్పీడ్ తో ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Mega Prince Varun Tej ) పర్సనల్ లైఫ్ లో కూడా గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే.
ఈయన పెళ్లి గురించి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇన్నాళ్లకు వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.
వరుణ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ( Lavanya Tripathi ) ని లవ్ చేసి పెళ్లి చేసుకోబోతున్నాడు.ఎన్నో ఏళ్ల రిలేషన్ లో ఉన్న ఈ జంట జూన్ 9న ఎంగేజ్మెంట్ ( Varun Lavanya’s engagement ) జరుపుకున్నారు.ఇక ఇప్పుడు నవంబర్ 1న ఈ జంట పెళ్లి కూడా గ్రాండ్ గా అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల మధ్య జరగబోతుంది.
ఇటలీలో వీరి పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే వధూవరులు అక్కడికి చేరుకున్నారు.ఇక మెగా కుటుంబం ఒక్కొక్కరికి అక్కడికి వెళ్లనున్నారు.నిహారిక, లావణ్య త్రిపాఠీకి సంబంధించిన సన్నహితులు అక్కడికి వెళ్లినట్టు సమాచారం.మెగా, అల్లు కుటుంబం నుండి అందరు హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ సతీసమేతంగా ఇటలీ పయనం అయినట్టు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.అసలు ఈయన బిజీ షెడ్యూల్ లో వెళ్లడం కష్టమే అనే కామెంట్స్ రాగా మిగిలిన వారి కంటే ముందుగానే పవన్ తన భార్య అన్నా లేజ్నేవాతో కలిసి ఇటలీ పయనం అయ్యారు.కొద్దిసేపటి క్రితం ఎయిర్ పోర్టులో కనిపించగా ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.పవన్ కాటన్ జీన్స్, మల్టీ కలర్ షర్ట్ ధరించి చేతి మీద కోటు వేసుకుని వెళ్తుండగా ఆయన భార్య అన్నా కూడా జీన్స్, వైట్ షర్ట్ వేసుకుని కనిపించింది.
ఈ జంట బయట సతీసమేతంగా కనిపించి చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో ఈ పిక్స్ క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.