టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కు సినిమాల విషయంలో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఉంది.పవన్ కళ్యాణ్ సినిమాల హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడింది.
పాలిటిక్స్ లో కూడా పవన్ సక్సెస్ సాధించాలని చాలామంది ఆకాంక్షిస్తున్నారు.అయితే రాయలసీమ( Rayalaseema ) నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జనసేనను బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
అనంతపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మాత్రం రాయలసీమలో కూడా జనసేన పార్టీకి తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోట్ల సంఖ్యలో ఉన్న అభిమానుల ఆకాంక్ష కాగా ఎప్పటికైనా ఆ కోరిక నెరవేరుతుందని అభిమానులు ఫీలవుతున్నారు.పవన్ కళ్యాణ్ జనసేన సిద్ధాంతాలు మంచివే అయినా పవన్ పార్టీని నడుపుతున్న తీరు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పవన్ కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను వదులుకుని రాజకీయాల్లో సంచలనాలు సృష్టించే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.
2024 ఎన్నికల్లో జనసేన పార్టీ( Janasena party ) ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎన్ని స్థానాలలో జనసేన పోటీ చేస్తుందనే చర్చ జరుగుతుండటం గమనార్హం.టీడీపీ జనసేన పార్టీల పొత్తు వల్ల ఈ రెండు పార్టీలకు అనుకూలంగా ఫలితాలు వస్తాయేమో చూడాల్సి ఉంది.రాయలసీమ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జనసేనను బలోపేతం చేయాలనుకున్న పవన్ అంటూ ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారం నిజం కావాలని జనసేన ఫ్యాన్స్ భావిస్తున్నారు.2024 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో సర్వేలు సైతం చెప్పలేకపోతున్నాయి.