ఇంగ్లాండ్ జట్టు టైటిల్ ఫేవరెట్ అనుకుంటే సెమీస్ చేరడం కూడా కష్టమే..!

ఇంగ్లాండ్ జట్టు( England Team ) టైటిల్ ఫేవరెట్ గా ఈ టోర్నీలో బరిలోకి దిగింది.మ్యాచ్ అన్నాక గెలుపు, ఓటములు సహజమే.

 Icc Odi Wc 2023 England Falls To 9 Th Position After Lose To Sri Lanka Makes Way-TeluguStop.com

అయితే ఇంగ్లాండ్ జట్టు మొదటి నుంచి సెమీఫైనల్( Semi Final ) రేసులో కొనసాగుతుందని టోర్నీ ఆరంభానికి ముందే ఎందరో క్రికెట్ నిపుణులు జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే.అయితే ఇంగ్లాండ్ జట్టు ఆడిన ఐదు మ్యాచ్లలో ఏకంగా నాలుగు మ్యాచ్లు ఓడి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.

కేవలం బంగ్లాదేశ్ జట్టుపై మాత్రమే ఇంగ్లాండ్ పై చేయి సాధించగలిగింది.మిగతా జట్ల చేతుల్లో పసికూన జట్ల కంటే హీనంగా ఓటమి చవిచూసింది.

ఈ టోర్నీలో ఇప్పటికే సగానికి పైగా మ్యాచులు పూర్తి అయిపోయాయి.ఇక ఇంగ్లాండ్ జట్టు సెమీఫైనల్ చేరడం కష్టమే.భారత్ వేదికగా జరుగుతున్న ఈ వన్డే వరల్డ్ కప్ లో( ODI World Cup ) ఇంగ్లాండ్ జట్టు టైటిల్ ఫేవరెట్ అని భారత జట్టు మాజీ దిగ్గజం గవాస్కర్( Gavaskar ) చెప్పిన సంగతి తెలిసిందే.అంటే ఇంగ్లాండ్ జట్టుపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది.

Telugu Afghanistan, Ben, England, Icc Odi Wc, Iccodi, Joe Root, Jos Buttler, Sem

2019 లో ప్రపంచ కప్( 2019 World Cup ) గెలిచిన ఇంగ్లాండ్ అప్పటినుంచి మంచి దూకుడు నే కొనసాగిస్తూ వస్తోంది.జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో బాగా పటిష్టంగానే ఉంది.కానీ ఎప్పుడైతే పసికూన ఆఫ్ఘనిస్తాన్ జట్టు( Afghanistan ) చేతులో ఇంగ్లాండ్ ఓడిపోయిందో ఇక ఆ జట్టుపై ఉండే అంచనాలన్నీ ఒక్కసారిగా తారుమారయ్యాయి.అప్పటినుంచి ఇంగ్లాండ్ జట్టు పేలవ ఆటను ప్రదర్శిస్తోంది.

Telugu Afghanistan, Ben, England, Icc Odi Wc, Iccodi, Joe Root, Jos Buttler, Sem

ఇంగ్లాండ్ జట్టు ఇంకా 4 మ్యాచులు ఆడాల్సి ఉంది.భారత్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్ లతో జరిగే మ్యాచ్లలో భారీ పరుగుల తేడాతో గెలవడమే కాకుండా మిగతా జట్ల ఫలితాలపై కూడా ఇంగ్లాండ్ జట్టు సెమీ ఫైనల్ చేరే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.అయితే పాయింట్ల పట్టికలో సగానికి పైగా మ్యాచ్లు పూర్తయిన తర్వాత తొమ్మిదవ స్థానంలో ఉండే జట్టు నాలుగో స్థానానికి చేరి సెమీఫైనల్ చేరడం అసాధ్యమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube