రాజన్న సిరిసిల్ల జిల్లా: మానకొండూర్ నియోజకవర్గంలో( Manakondur Constituency ) రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ సమక్షంలో కాంగ్రెస్,బీజేపీ పార్టీల నుండి బీ.ఆర్.
ఎస్.పార్టీలో చేరికలు రోజు రోజుకు జోరుగా పెరిగిపోతున్నాయి.ఇల్లంతకుంట మండలంలోని సిరికొండ గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పాటు యువకులు మంగళవారం రోజున భారీగా గులాబీ కండువాలు కప్పుకున్నారు.ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ పదవి మీరు పెట్టిన బిక్షే అని మరోసారి ఆశీర్వదిస్తే మరింత గొప్పగా పని చేస్తాని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ( Congress party ) హామీలకే పరిమితం అని దొంగ పథకాలతో సాధ్యం కాని హమీలతో ప్రజలను మోసం చేయడానికి గ్రామాలలో తిరుగుతున్నారని వారి మాయ మాటలు నమ్మద్దు అని కాంగ్రేస్ ఇదే మాయ మాటలు సాద్యం కాని హామీలు నీటి మూటలు అయ్యాయని, నన్ను నమ్మి రెండు సార్లు నన్ను గెలిపించారని,మరో సారి నన్ను అశీర్వదిస్తే మానకొండూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తానని, కెసిఆర్ లేని తెలంగాణ ఊహించుకొలేమని,మనం తప్పు చేస్తే భవిష్యత్ తరాలు అంధకారం అవుతాయని, పచ్చని తెలంగాణ లో చిచ్చు పెట్టి మన సంపద దోచుకెళ్లాలని చూస్తున్న కాంగ్రెస్ బీజేపీ పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలని,పదేళ్ల కెసిఆర్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మరోసారి కెసిఆర్ పాలన కోసం సిద్దంగా ఉన్నారని,45 రోజులు నా కోసం పనిచేస్తే 5 ఏళ్లు మీకోసం పనిచేస్తానని, పదవులు ఎన్ని వచ్చినా తను మారే వ్యక్తిని కాదని, పార్టీ కార్యకర్తలే మా బలంమా ధైర్యం అని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.