రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట( Gambhiraopet ) మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వేదాంతి పద్మావతి, వేదాంతి గోపాల చారి లు కొత్తపల్లి బస్ స్టాండ్ లో తలదాచుకున్న పరిస్థితి తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Balaraju Yadav, ), గంభీరావుపేట ఎస్.ఐ మహేష్ లు మానవతా దృక్పథంతో ఆలోచించి ఎల్లారెడ్డి పేట( Yellareddi peta ) డే కేర్ సెంటర్ లో చేర్పించగా ప్రతి నెల మందులు వాడుతున్న దృష్ట్యా నెల రోజుల కు సరిపడు మందులను మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ వేదాంతం గోపాల చారి బాలరాజు ఇంటికి రాగా అతడికి అందించారు.
ప్రతినెలా తల్లి కొడుకులకు సరిపడు మందులను అందిస్తానని ఆయన గోపాల చారి కి హామీ ఇచ్చారు.