యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం( Samsthan Narayanapur ) మండల కేంద్రంలో శనివారం ఎంగిలిపూల బతుకమ్మ ( Engilipula Bathukamma Celebrations )సంబరాలు ఘనంగా నిర్వహించారు.అనంతరం గౌరమ్మను గంగమ్మ వడికి సాగనంపే తరుణంలో చెరువులో నీరు లేక వాగు వంతెనపై, ఆలయ ప్రాకారాలపై నిమజ్జనం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దీనితో గౌరమ్మను గంగమ్మ వడికి చేర్చే భాగ్యం తమకు లేకుండా పోయిందని మహిళలు ఒకింత అసహనం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో చెరువులన్నీ జలకళను సంతరించుకునిరైతులు( Farmers ) కేరింతలు కొడుతున్నారని ప్రభుత్వం గొప్పలు చెబుతుంటే మరి ఇక్కడ చుక్కనీరు లేకుండా పోవడానికి కారణం ఎవరో మరి…?!
.