బండ్ల గణేష్ కి ఎమ్మెల్యే సీటు వద్దట... ఇదో పెద్ద జోక్‌ భయ్యా!

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) తరపున నిర్మాత బండ్ల గణేష్‌ ప్రచారం చేసిన విషయం తెల్సిందే.ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే కోసుకుంటాను అంటూ కూడా వ్యాఖ్యలు చేసి సెన్షేషన్ క్రియేట్‌ చేశాడు.

 Bandla Ganesh Interesting Comments About Congress , Congress Party , Poltics , T-TeluguStop.com

మొత్తానికి కాంగ్రెస్ ఓడి పోవడంతో కనిపించకుండా పోయాడు.బాబోయ్ నాకు ఈ రాజకీయాలు నాకు వద్దు అన్నట్లుగా దూరం అయ్యాడు.

మళ్లీ ఏం జరిగిందో ఏమో కానీ కాంగ్రెస్ పార్టీ లో ఉన్నాను. రేవంత్‌ రెడ్డికి( Revanth Reddy ) నా పూర్తి మద్దతు అన్నట్లుగా ప్రకటనలు చేస్తూ వస్తున్నాడు.

తాజాగా బండ్ల గణేష్‌ సోషల్‌ మీడియా లో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ట్విట్టర్‌ లో బండ్ల గణేష్( Bandla ganesh )… నేను ఈసారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యను.

రేవంత్ రెడ్డి( Revanth Reddy ) గారు నాకు ఇప్పుడు అవకాశం ఇస్తాను అని చెప్పారు కానీ నాకు ఈసారి టికెట్ వద్దు.కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యం దానికోసం పనిచేస్తాను.రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి.నేను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు.ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే నా ధ్యేయం.తప్పకుండా అధికారంలోకి వస్తుంది.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం, అదికారంలోకి వస్తాం జై కాంగ్రెస్ అంటూ ట్వీట్‌ చేశాడు.

ఈ ట్వీట్‌ పై పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఒక వైపు కాంగ్రెస్ లో టికెట్ల కోసం కొట్లాట జరుగుతూ ఉంటే నీకు రేవంత్‌ రెడ్డి సీటు ఇస్తానంటూ అన్నాడు… నువ్వు వద్దు అన్నావా అంటూ ఎద్దేవ చేస్తున్నారు.బండ్ల గణేష్ ప్రీ రిలీజ్ వేడుకల సందర్భంగా ఇలాంటి అతి వ్యాఖ్యలు చేస్తే పర్వాలేదు కానీ ఇలా ట్విట్టర్ లో కూడా రాజకీయాల గురించి అతి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అన్నట్లుగా మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube